కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో ‘సాహో’ టీజర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సాహో’ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేకింగ్ వీడియోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శక నిర్మాతలు ఇప్పుడు ఏకంగా టీజర్ తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు.

ఇవ్వాలే విడుదలైన ‘సాహో’ సినిమా టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్…. ఈ  సినిమా ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక ప్రభాస్ మరియు శ్రద్ధా కపూర్ ల మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. టీజర్ చూస్తుంటే శ్రద్ధ కపూర్ కూడా ప్రభాస్ తో కలిసి కొన్ని ఫైట్స్ సీన్లలో కనిపించబోతోంది అని చెప్పుకోవచ్చు.

ఇక ఈ సినిమాలో రోమాలు నిక్కబొడుచుకునేలా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. యువీ క్రియేషన్స్ మరియు టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాకీ శ్రోఫ్, మందిర బేడీ, నీల్ నితిన్ ముకేశ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 న ‘సాహో’ విడుదల కాబోతోంది.