మళ్ళీ “ఒక్క ఛాన్స్” అని అడుగుతున్న సంగీత

తెలుగు సినిమా పరిశ్రమ లో కొన్ని పాత్రలు అలా నిలిచిపోతాయి. ఎన్ని సంవత్సరాలు అయినా కానీ కొన్ని పాత్రలు మాత్రం ప్రేక్షకుల తో నే ఉంటాయి. అలాంటి ఒక పాత్ర ఖడ్గం సినిమా లో సంగీత చేశారు.

ఈ సినిమా లో సంగీత హీరోయిన్ అవ్వాలని తపించే పాత్ర ని అలవోకగా పోషించారు. ‘ఒక్క ఛాన్స్’ అని ఆమె అడిగే తీరు, డైలాగ్ చెప్పే విధానం పెద్ద హిట్. ఆ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు వచ్చినా… సంగీత మాత్రం కథ కి, తన పాత్ర కి ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లోనే నటించారు.

కొద్ది రోజులకి పెళ్ళి చేసుకొని సినిమా కెరీర్ కి బ్రేక్ తీసుకున్నారు. తర్వాత వ్యక్తిగత జీవితం లో కొన్ని వివాదాలు నడిచినా ఇప్పుడు వాటిని అధిగమించి సినిమా పరిశ్రమ లో రెండో ఇన్నింగ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

రెండో ఇన్నింగ్స్ లో కూడా ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వమని ఆమె దర్శక నిర్మాతలని కోరుతున్నట్లు సమాచారం. హీరోయిన్ గా వివిధ వేరియేషన్స్ ఉన్న పాత్రలని పోషించిన సంగీత ఇప్పుడు కంబాక్ లో కూడా విలక్షణమైన పాత్రలని పోషించాలని భావిస్తుందట. ఇప్పటికే పలు దర్శకుల తో చర్చలు జరుపుతున్న ఈ భామ త్వరలో నే ఒక క్లారిటీ కి వచ్చే అవకాశం కనిపిస్తుంది.