మహిళా ప్రపంచకప్ సాకర్ లో అమెరికా రికార్డు

  • థాయ్ లాండ్ పై 13-0 గోల్స్ తో రికార్డు గెలుపు
  • జర్మనీ 11 గోల్స్ రికార్డును అధిగమించిన అమెరికా

ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 2019 పిఫా ప్రపంచకప్ మహిళా ఫుట్ బాల్ గ్రూప్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో…డిఫెండింగ్ చాంపియన్ అమెరికా.. భారీవిజయంతో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది.

థాయ్ లాండ్ తో జరిగిన ఈ ఏకపక్ష పోరు..ఆట రెండో భాగంలో అమెరికా ప్లేయర్లు 10 గోల్స్ సాధించడం విశేషం. అమెరికా ప్లేయర్లలో.. అలెక్స్ మోర్గాన్ ఐదు గోల్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచింది. రోజ్ లావెల్లీ, సమాంతా చెరో రెండుగోల్స్ సాధించారు.

2007 ప్రపంచకప్ లో జర్మనీ 11-0 గోల్స్ తో అర్జెంటీనాను చిత్తు చేసిన రికార్డును…ప్రస్తుత ప్రపంచకప్ మ్యాచ్ ద్వారా అమెరికా తెరమరుగు చేసింది.

నాలుగోసారి ప్రపంచకప్ విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉన్న అమెరికా…ఆదివారం జరిగే పోటీలో చిలీతో తలపడనుంది.