Telugu Global
NEWS

ఫింఛన్ల అర్హతను 65 ఏళ్ల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ శాసన సభలో ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్) ఇస్తామని, సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్ధను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. సహకార రంగాన్ని పునరుద్దరించడంతో పాటు రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్దికి తమ ప్రభుత్వం పాటు పడుతుందన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశల వారిగా చేపడతామని, […]

ఫింఛన్ల అర్హతను 65 ఏళ్ల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం
X

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ శాసన సభలో ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్) ఇస్తామని, సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్ధను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు.

సహకార రంగాన్ని పునరుద్దరించడంతో పాటు రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్దికి తమ ప్రభుత్వం పాటు పడుతుందన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశల వారిగా చేపడతామని, ముందుగా బెల్ట్ షాపులను లేకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గవర్నర్ చెప్పారు. ఫింఛన్ల అర్హతను 65 ఏళ్ల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తామని, దీని వల్ల రాష్ట్రంలో లక్షల మందికి తమ ప్రభుత్వం మేలు చేకూరుస్తుందని గవర్నర్ చెప్పారు.

ప్రస్తుతం అమలులో ఉన్న ఇసుక విధానాన్ని పూర్తిగా మారుస్తామని, నూతన విధానంతో ముందుకు వెళతామని చెప్పారు. ఇక డ్వాక్ర మహిళలకు ఇచ్చే రుణాన్ని నాలుగు విడతలుగా నేరుగా వారికే అందిస్తామని చెప్పారు. జర్నలిస్టులు, న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తామని గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో ప్రకటించారు.

తమ ప్రభుత్వ పాలన ఎలా ఉందో గడచిన పదిరోజుల పాలనను అంచనా వేస్తే తెలుస్తుందని గవర్నర్ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, హోంగార్డులు, పారిశుద్య కార్మికుల జీతాలను అధికారంలోకి వచ్చిన పదిరోజులలోనే తమ ప్రభుత్వం పెంచిందని గవర్నర్ అన్నారు. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి… తెలుగులోనే ముగించారు. అయితే ప్రసంగం ప్రారంభానికి, ముగింపునకు మధ్యలో ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలు, ఆశయాలను మాత్రం ఇంగ్లీషులో వివరించడం విశేషం.

First Published:  14 Jun 2019 12:10 AM GMT
Next Story