Telugu Global
Cinema & Entertainment

కొడుకు పుట్టిన రోజు... ఇన్ స్టాగ్రాం లో ఫొటోలు....

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి కూడా ఎంతో కొంత సమయం కేటాయిస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ రెండవ కుమారుడు భార్గవ్ రామ్ ఇవాళ తన మొదటి పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. View this post on Instagram #Bhargav turns one! A post shared by Jr NTR (@jrntr) on Jun 13, 2019 at 9:34pm PDT ఈ సందర్భంగా భార్గవ్ కు సంవత్సరం నిండింది…. అంటూ ఎన్టీఆర్ ఇన్ […]

కొడుకు పుట్టిన రోజు... ఇన్ స్టాగ్రాం లో ఫొటోలు....
X

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి కూడా ఎంతో కొంత సమయం కేటాయిస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ రెండవ కుమారుడు భార్గవ్ రామ్ ఇవాళ తన మొదటి పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

View this post on Instagram

#Bhargav turns one!

A post shared by Jr NTR (@jrntr) on

ఈ సందర్భంగా భార్గవ్ కు సంవత్సరం నిండింది…. అంటూ ఎన్టీఆర్ ఇన్ స్టాగ్రాం లో రెండు క్యూట్ ఫొటోలను షేర్ చేశారు. ఒకదాంట్లో ఎన్టీఆర్ మరియు భార్గవ్ రామ్ ఉయ్యాలలో కూర్చుని ఆడుకుంటున్నట్లు ఉండగా మరొక దాంట్లో భార్గవ్ అన్నయ్య అభయ్ రామ్ తో కనిపించాడు.

View this post on Instagram

#Bhargav turns one!

A post shared by Jr NTR (@jrntr) on

ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అభిమానులందరూ భార్గవ్ రామ్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రణతిల వివాహం 2011 మే 5న జరిగింది. వీరిద్దరి మొదటి కుమారుడు అభయ్ రామ్ జులై 22, 2014 న జన్మించాడు. ఇక రెండవ కుమారుడు భార్గవ్ రామ్ గతేడాది జూన్ 14న పుట్టిన సంగతి తెలిసిందే.

సినిమాల పరంగా చూస్తే ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే అతి పెద్ద మల్టీ స్టారర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది.

View this post on Instagram

8 Years!! Looking forward to many more…

A post shared by Jr NTR (@jrntr) on

First Published:  14 Jun 2019 2:03 AM GMT
Next Story