కేవలం ఒక్క సన్నివేశానికి 90 కోట్లు ఖర్చు పెట్టారట

కేవలం ప్రభాస్ అభిమానులే కాక తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘సాహో’. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే రెండు మేకింగ్ వీడియోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర దర్శక నిర్మాతలు తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో చూస్తే సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కబోతోందని తెలుస్తోంది. మాధి అందించిన విజువల్స్ సినిమాకి ఊపిరి పోసాయి. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ముఖ్యంగా ప్రభాస్ వెనుక రెండు పెద్ద ట్రక్కులు చేస్ చేస్తున్న ఆ సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. ఫ్లై ఓవర్ మీద సాగే ఆ సన్నివేశాన్ని దుబాయ్ లో 90 కోట్లు పెట్టి చిత్రీకరించినట్లు తెలుస్తోంది. టీజర్లో కేవలం కొన్ని సెకన్లు మాత్రమే మనకు కనిపించిన ఈ సన్నివేశానికి సినిమాలో మాత్రం 15 నిమిషాల నిడివి ఉండబోతుందట. ఈ సీన్ సినిమాలో హైలైట్ గా మారబోతోందని తెలుస్తోంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఈ సినిమా కి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారట. యువీ క్రియేషన్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతోంది.