మరో వివాదం లో యాంకర్ రవి…. ట్విట్టర్ లో వివరణ

యాంకర్ రవి… మా మ్యూజిక్ ఛానల్ లో ఒక ప్రోగ్రాంకి వీ జీ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత అంచెలంచెలు గా ఎదిగి, ఒక సినిమా లో హీరో గా కూడా చేశాడు. అయితే ఈ యాంకర్ చాలా సార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఒక్క సరి కాదు, రెండు సార్లు కాదు, ఇప్పటికే చాలా సార్లు అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుని, చివాట్లు తిని మళ్ళీ క్షమాపణలు కోరాడు. ఇప్పుడు తాజా గా మరొక వివాదం లో ఇరుక్కున్నాడు రవి.

వివరాల్లోకి వెళితే తను హోస్ట్ చేస్తున్న ఒక షో లో ఒక కంటెస్టెంట్ ఏపీ ప్రజలపై కామెంట్స్ చేయగా, దానికి రవి ఇచ్చిన రెస్పాన్స్ అతన్ని ప్రోత్సహించినట్టు, రవి ఆంధ్రా ప్రజలకి వ్యతిరేకం గా ఉన్నట్టు అనిపించాయి. ఈ విషయమై సోషల్ మీడియా లో రవి మీద విమర్శలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న రవి దానికి వివరణ ఇస్తూ ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేసాడు.

“నేను నా దేశాన్ని, నా రెండు రాష్ట్రాలని ప్రేమిస్తున్నాను. నా తప్పును వెతక్కండి. అర్ధం చేస్కోండి” అని రాసి ఒక వీడియో పోస్ట్ చేసాడు.