మాల్దీవుల్లో ఇస్మార్ట్ శంకర్ హంగామా

టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఇస్మార్ట్ శంకర్, ప్రస్తుతం పాటల కోసం హ్యాంగ్ అవుట్స్ అన్నీ చుట్టేస్తున్నాడు. ఇప్పటికే గోవాలో ఓ పాట తీయగా, ఇప్పుడు మాల్టీవుకు చెక్కేశాడు. గోవాలో నభా నటేష్ తో రొమాన్స్ చేసిన రామ్.. ఇప్పుడు మాల్దీవుల్లో నిధి అగర్వాల్ తో చిందులేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ రొమాంటిక్ సాంగ్ ను పిక్చరైజ్ చేస్తున్నారు.

ఓవైపు పాటల షూటింగ్ పూర్తిచేస్తూనే, మరోవైపు దశలవారీగా ఆడియో సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే దిమాక్ ఖరాబ్ అనే సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా జింబాబాద్ అనే సాంగ్ ను కూడా విడుదల చేశారు. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ రెండు పాటలకు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.

పూరి జగన్నాధ్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. జులై 12న ఇస్మార్ట్ శంకర్ ను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.