Telugu Global
NEWS

భారత్-పాక్ వన్డే సమరానికి వానగండం

మ్యాచ్ వేదిక మాంచెస్టర్ లో భారీగా వానలు వానదెబ్బతో పాక్, భారత్ అభిమానుల నిరాశ వన్డే ప్రపంచకప్ లో..చిరకాల ప్రత్యర్థుల సమరం కోసం మాజీ చాంపియన్లు భారత్, పాకిస్థాన్ ఓ వైపు ఢీ అంటే ఢీ అంటుంటే..మరో వైపు రెండుదేశాల అభిమానులు ఈ సూపర్ సండే ఫైట్ కోసం ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే…ఆదివారం జరగాల్సిన ఈ మ్యాచ్ కు సైతం వానగండం తప్పదని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించింది. మ్యాచ్ వేదికగా మాంచెస్టర్ లో గత మూడురోజులుగా విడవకుండా […]

భారత్-పాక్ వన్డే సమరానికి వానగండం
X
  • మ్యాచ్ వేదిక మాంచెస్టర్ లో భారీగా వానలు
  • వానదెబ్బతో పాక్, భారత్ అభిమానుల నిరాశ

వన్డే ప్రపంచకప్ లో..చిరకాల ప్రత్యర్థుల సమరం కోసం మాజీ చాంపియన్లు భారత్, పాకిస్థాన్ ఓ వైపు ఢీ అంటే ఢీ అంటుంటే..మరో వైపు రెండుదేశాల అభిమానులు ఈ సూపర్ సండే ఫైట్ కోసం ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

అయితే…ఆదివారం జరగాల్సిన ఈ మ్యాచ్ కు సైతం వానగండం తప్పదని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించింది.
మ్యాచ్ వేదికగా మాంచెస్టర్ లో గత మూడురోజులుగా విడవకుండా వానపడడంతో గ్రౌండ్ చిత్తడిచిత్తడిగా మారింది.

అంతేకాదు…రానున్న రెండురోజులూ వానపడే అవకాశం ఉండడంతో…మ్యాచ్ జరగడం డౌట్ గా మారింది.
ఇప్పటికే భారత్ -న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్…వానదెబ్బతో రద్దు కావడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది.

భారత్ ఇప్పటి వరకూ ఆడిన మూడుమ్యాచ్ ల్లో రెండు విజయాల ద్వారా 5 పాయింట్లు సాధించగా…పాక్ ఆడిన నాలుగుమ్యాచ్ ల్లో రెండు పరాజయాలు, ఓ విజయంతో..మూడుపాయింట్లు మాత్రమే సంపాదించగలిగింది.

ప్రస్తుత ప్రపంచకప్ లో వానదెబ్బతో ఇప్పటికే నాలుగుమ్యాచ్ లు రద్దు కావడం …ప్రపంచకప్ చరిత్రలో..ఇదే మొదటిసారి.

First Published:  14 Jun 2019 7:30 PM GMT
Next Story