Telugu Global
NEWS

పదవిపోతే... కొన్ని సౌకర్యాలూ పోతాయ్‌

ఏపీ సీఎంగా చంద్రబాబు మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత మాత్రమే. అధికారం పోగానే ఆయన పరిస్థితి పూర్తిగా మారింది. జడ్ ప్లస్ కేటగిరి భద్రతతో స్సెషల్ ట్రీట్ మెంట్ ఉంటుంది ఆయనకు విమానాశ్రయాల్లో. నేరుగా విమానం దగ్గరకు ఆయన వాహనం వెళుతుంది. కానీ ఇప్పుడు విమానాశ్రయం బయటే ఆయన కారు దిగి వెళ్లాల్సిన పరిస్థితి. తాజాగా గన్నవరం విమానాశ్రయం బయటే ఆయన వాహనాన్ని ఆపి సామాన్యుల మాదిరిగానే ఆయనను సెక్యూరిటీ […]

పదవిపోతే... కొన్ని సౌకర్యాలూ పోతాయ్‌
X

ఏపీ సీఎంగా చంద్రబాబు మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత మాత్రమే. అధికారం పోగానే ఆయన పరిస్థితి పూర్తిగా మారింది. జడ్ ప్లస్ కేటగిరి భద్రతతో స్సెషల్ ట్రీట్ మెంట్ ఉంటుంది ఆయనకు విమానాశ్రయాల్లో. నేరుగా విమానం దగ్గరకు ఆయన వాహనం వెళుతుంది. కానీ ఇప్పుడు విమానాశ్రయం బయటే ఆయన కారు దిగి వెళ్లాల్సిన పరిస్థితి.

తాజాగా గన్నవరం విమానాశ్రయం బయటే ఆయన వాహనాన్ని ఆపి సామాన్యుల మాదిరిగానే ఆయనను సెక్యూరిటీ తనిఖీలు చేశారు. దీనిపై ఎల్లో మీడియా చాలా రాద్ధాంతం చేసింది. చంద్రబాబును అవమానించారంటూ కోడైకూసింది. రచ్చ రచ్చ చేస్తోంది.

అయితే చంద్రబాబు నాయుడిని తనిఖీ చేయడంపై తాజాగా వైసీపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు.

ప్రతిపక్ష నేతగా నాడు జగన్ ను విశాఖ ఎయిర్ పోర్టులో రాష్ట్ర పోలీసులు ఆపేసినప్పుడు ఆ విషయాలు రాయకుండా జగన్‌ పోలీస్‌లపై మండిపడ్డాడని ఇదే పచ్చమీడియా జగన్ పై అక్కసు వెళ్లగక్కిందని.. ఇప్పుడు చంద్రబాబును కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తనిఖీలు చేస్తేనే శోకాలు పెడుతోందని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టా.? అని విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇక ఒక బీసీ నేత తమ్మినేనిని స్పీకర్ చేస్తే గౌరవించని చంద్రబాబు.. నాడు తన కులానికి చెందిన కోడెలను స్పీకర్‌ను చేస్తే మాత్రం గౌరవంగా వేదిక దగ్గరకు తీసుకువెళ్ళాడని, అప్పుడు సభాసంప్రదాయాలను జగన్ గౌరవించి కోడెలను తీసుకెళ్లి కూర్చుండబెట్టాడని…. బాబుకు జగన్ కు అదే తేడా అని విజయాసాయిరెడ్డి విమర్శించారు.

First Published:  15 Jun 2019 1:24 AM GMT
Next Story