మహేష్ కోసం సినిమా వదిలేసుకున్న రష్మిక

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘గీతగోవిందం’ సినిమా బ్లాక్ బస్టర్ తో హ్యాపెనింగ్ బ్యూటీ గా మారిపోయింది. తాజాగా మహేష్ బాబు-అనిల్ రావిపూడి సినిమాలో రష్మీక హీరోయిన్ గా నటిస్తోంది అనే వార్త బయటకు వచ్చింది. కానీ ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ రష్మిక మందన్న తమిళంలో ఒక పెద్ద సినిమాకు సైన్ చేసినట్లు చెప్పుకొచ్చింది.

ఇది జరిగి కొన్ని రోజులు కూడా కాలేదు అప్పుడే మళ్ళీ రష్మిక మందన్న మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా ఫైనలైజ్ అయింది.

అయితే తాజాగా దీని వెనుక ఒక పెద్ద కారణం ఉన్నట్లు తెలుస్తోంది. రష్మిక మందన్న కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.

అనవసరమైన లిప్ లాక్ సన్నివేశాలు, గ్లామరస్ పాత్రలు చేయడంపై రష్మిక మందన్న అసలు ఏమాత్రం ఆసక్తి చూపటం లేదు. అందుకే కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ సినిమాలో తనకు అంత మంచి పాత్ర దక్కకపోవడంతో రష్మిక మందన్న తప్పుకుందని, తన డేట్లు ఖాళీ ఉన్నాయని అనిల్ రావిపూడి కి ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

మరోవైపు అనిల్ రావిపూడి తన సినిమాలలో హీరోయిన్ పాత్రలకు కూడా ప్రాధాన్యత ఇస్తారని తెలిసిందే. అందుకే అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించేందుకు రష్మీక ఏమాత్రం వెనకడుగు వేయలేదు అని తెలుస్తోంది.