Telugu Global
Cinema & Entertainment

అయ్యో సాహో.. శాటిలైట్ కొనేవారు లేరా!

పెద్ద హీరోల సినిమాలు సెట్స్ పైకి వెళ్లకముందే అమ్ముడుపోతుంటాయి. మరీ ముఖ్యంగా శాటిలైట్ రైట్స్ విషయంలో పెద్ద హీరోలు ముందుంటారు. కానీ హీరో ప్రభాస్ మాత్రం ఈసారి ఫెయిల్ అయ్యాడు. అతడు నటిస్తున్న సాహో సినిమా శాటిలైట్ రైట్స్ ఇప్పటివరకు అమ్ముడుపోలేదు. అవును.. ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోలేదు. బాహుబలి తర్వాత వస్తున్న క్రేజీ ప్రాజెక్టు అయినప్పటికీ తెలుగు శాటిలైట్ డీల్ లాక్ అవ్వకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. […]

అయ్యో సాహో.. శాటిలైట్ కొనేవారు లేరా!
X

పెద్ద హీరోల సినిమాలు సెట్స్ పైకి వెళ్లకముందే అమ్ముడుపోతుంటాయి. మరీ ముఖ్యంగా శాటిలైట్ రైట్స్ విషయంలో పెద్ద హీరోలు ముందుంటారు. కానీ హీరో ప్రభాస్ మాత్రం ఈసారి ఫెయిల్ అయ్యాడు. అతడు నటిస్తున్న సాహో సినిమా శాటిలైట్ రైట్స్ ఇప్పటివరకు అమ్ముడుపోలేదు.

అవును.. ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోలేదు. బాహుబలి తర్వాత వస్తున్న క్రేజీ ప్రాజెక్టు అయినప్పటికీ తెలుగు శాటిలైట్ డీల్ లాక్ అవ్వకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఈ సినిమా కోసం భారీ రేట్లు చెబుతున్నారు సాహో నిర్మాతలు. తెలుగులో అంత మొత్తం ఇవ్వడానికి ఛానెల్స్ ముందుకురావడం లేదు. మరోవైపు సాహో హిందీ శాటిలైట్ రైట్స్ మాత్రం 50 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.

తెలుగు శాటిలైట్ రైట్స్ కోసం 30 కోట్ల రూపాయలు చెబుతున్నారు నిర్మాతలు. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఇది చాలా ఎక్కువ. అందుకే డీల్ సెట్ అవ్వడం లేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. 22 కోట్ల నుంచి 24 కోట్ల రూపాయల మధ్యలో సాహో శాటిలైట్ డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది.

First Published:  15 Jun 2019 4:03 AM GMT
Next Story