Telugu Global
NEWS

అవినీతి ఎమ్మెల్యే లను ప్రోత్సహించారు.... అందుకే ఓడిపోయాం

“గడిచిన ఐదేళ్లలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేసిన అవినీతికి అంతులేకుండా పోయింది. పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజలే చర్య తీసుకుని మనల్ని దారుణంగా ఓడించారు” ఇవీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల వర్క్ షాప్ లో పాల్గొన్న కొందరి అభిప్రాయం. శుక్రవారం విజయవాడలో జరిగిన ఈ వర్క్ షాపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు కొందరు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలోనే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని సమాచారం. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రసంగించిన […]

అవినీతి ఎమ్మెల్యే లను ప్రోత్సహించారు.... అందుకే ఓడిపోయాం
X

“గడిచిన ఐదేళ్లలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేసిన అవినీతికి అంతులేకుండా పోయింది. పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజలే చర్య తీసుకుని మనల్ని దారుణంగా ఓడించారు” ఇవీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల వర్క్ షాప్ లో పాల్గొన్న కొందరి అభిప్రాయం.

శుక్రవారం విజయవాడలో జరిగిన ఈ వర్క్ షాపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు కొందరు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలోనే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని సమాచారం. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రసంగించిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గతంలో కూడా పార్టీ ఓటమి పాలయిందని, ఆ ఓటమికి కారణాలు తెలుసునని, ఇప్పటి ఓటమికి మాత్రం ఎలాంటి కారణాలు తెలియడం లేదని అన్నారు. అధినేత ప్రసంగించిన తర్వాత అభ్యర్ధులు కొందరు అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పినట్లు సమాచారం.

పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల వరకు కూడా కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు చేసిన అవినీతికి అంతు లేకుండా పోయిందని, దీనిని ప్రజలు నిశితంగా పరిశీలించి సరైన సమయంలో తమ కసి తీర్చుకున్నారని కొందరు అభిప్రాయ పడినట్లు సమాచారం. జన్మభూమి కమిటీల అరాచకాలకు అంతు లేకుండా పోయిందని, ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేసినా పట్టించుకున్న పాపాన పోలేదని నాయకులు కొందరు వాపోయినట్లు చెబుతున్నారు.

సీనియర్ నాయకుల అవినీతికి కొందరు అధికారులు కూడా తమ వంతు సహాయం చేశారని, సాయం చేయని వారిపై ఎమ్మెల్యేలు దాడులకు కూడా పాల్పడడం పార్టీకి తీవ్ర నష్టం కలిగించిందని అధినేత ముందే అభ్యర్ధులు కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం.

చాలామంది ఎమ్మెల్యేలు లోకేష్ అవినీతి గురించి, చింతమనేని ప్రభాకర్ అరాచకాల గురించి, కోడెల శివప్రసాద్ ప్రవర్తన గురించి పరోక్షంగా ప్రస్తావించినట్టు తెలిసింది. జూపూడి ప్రభాకర్ రావు అయితే ఏకంగా…. తెలుగుదేశంలో మానవ సంబంధాలే లేవు అని వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు.

ఈ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిశితంగా విన్నారని, ఎన్నికలలో లోపాలను సవరించుకొని అధికారంలోకి వచ్చేందుకు క్షేత్రస్థాయిలో కష్టపడాలని ఆయన సూచించినట్లు సమాచారం.

First Published:  15 Jun 2019 12:07 AM GMT
Next Story