తండ్రికి సపోర్ట్ గా వరలక్ష్మి…. విశాల్ పై ఘాటైన వ్యాఖ్యలు

కోలీవుడ్ నటుడు విశాల్…. శరత్ కుమార్ పై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. శరత్ కుమార్ పై విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ నేపథ్యంలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్…. విశాల్ పై మండి పడింది. నిజానికి వరలక్ష్మి శరత్ కుమార్ మరియు విశాల్ చాలా మంచి స్నేహితులు. ఒకానొక సమయంలో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని పుకార్లు కూడా వినిపించాయి. కానీ అప్పుడే విశాల్-అనిషా ల నిశ్చితార్ధం జరగడంతో ఈ వార్తలకు ఫులిస్టాప్ పడింది. తాజాగా తన తండ్రిపై విశాల్ చేసిన వ్యాఖ్యలపై వరలక్ష్మి ఘాటుగా స్పందించింది.

“డియర్ విశాల్.. నువ్వు నీ ఎలక్షన్ క్యాంపెయిన్ ల కోసం ఇంత నీచానికి దిగజారడం చూసి చాలా ఆశ్చర్యంగా ఉంది. నీమీద నాకు మిగిలి ఉన్న గౌరవం కూడా ఇప్పుడు పోయింది. అసలు ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని మా నాన్న పేరు ఎందుకు లాక్కొస్తున్నావ్? ఒకవేళ ఆయన నిజంగా తప్పు చేసి ఉంటే చట్టమే ఆయనను శిక్షించేది. కాబట్టి ఇకనైనా ఇలాంటి చీప్ వీడియోలు చేయకు. దీనికి కారణం నువ్వు పెరిగిన వాతావరణం కాబోలు. ఇన్నాళ్ళు స్నేహితురాలుగా నీకు మద్దతు ఇచ్చాను. కానీ ఇకమీదట నీకు నా మద్దతు దొరకదు. నువ్వు నా ఓటు ను కోల్పోయావ్” అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. మరి దీనిపై విశాల్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.