విరాటపర్వం మొదలైంది

దాదాపు 6 నెలల నుంచి వార్తల్లో నలుగుతున్న విరాటపర్వం సినిమా ఎట్టకేలకు మొదలైంది. సురేష్ కాంపౌండ్ లో ఓ కథ ఓకే అయి, ఓపెనింగ్ వరకు వచ్చిందంతే నిజంగా గొప్ప విషయమే. ఆ విజయమే ఇప్పుడు దర్శకుడు వేణు ఉడుగుల జీవితంలోకి వచ్చింది. ఈరోజు విరాటపర్వం ప్రాజెక్టు మొదలైంది. రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లు.

ముహూర్త‌పు స‌న్నివేశానికి వెంక‌టేశ్ క్లాప్ కొట్ట‌గా, ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి పాల్గొన్నారు. వ‌చ్చే వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది.

వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని, దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి ప‌తాకాల‌పై సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఓ డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నాడు రానా. అడవిరాముడు సినిమా కోసం 60 ఏళ్ల వృద్ధుడిగా మారిన గెటప్ అది. సినిమాపై హైప్ తగ్గకుండా ఉండేందుకు, విరాటపర్వం ఓపెనింగ్ కు రానా వచ్చినప్పటికీ, అతడి గెటప్ కు సంబంధించిన స్టిల్స్ మాత్రం మీడియాకు రిలీజ్ చేయలేదు.