ఫలక్‌నుమా దాస్‌…. నెక్ట్స్ ఏంటి?

ఫలక్‌నుమా దాస్‌ సినిమా తో వివాదం రేపిన హీరో విశ్వక్సేన్ ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ సినిమా నైజాం లో మంచి లాభాల తో నడుస్తుంది. అయితే ఈ నటుడు తర్వాత ఏ సినిమా చేస్తాడా అనే ఆసక్తి రేకిస్తున్నాడు.

సక్సెస్ మీట్ లో విశ్వక్సేన్ మాట్లాడుతూ… ఫలక్నూమా దాస్ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అని ప్రకటించినా ఆ చిత్రం ఇప్పుడప్పుడే పట్టాలు ఎక్కేలా గా కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం విశ్వక్సేన్ ఒక హిందీ చిత్రం చేయనున్నాడు. హిందీ మరియు తెలుగు భాషల్లో ఒకేసారి ఈ సినిమా రానుంది.

ఇది ఫలక్నూమా దాస్ సీక్వెల్, నాని నిర్మాణం లో కూడా వచ్చే చిత్రం కూడా కాదని, పూర్తిగా విశ్వక్ తన సొంత డబ్బులతో ఒక సినిమా చేయనున్నాడని టాక్. ఈ సినిమా కి స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా, త్వరలో అధికారికం గా ఈ సినిమా కి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అంతే కాకుండా ఎం ఎస్ రాజు నిర్మాణం లో కూడా విశ్వక్ త్వరలో ఒక సినిమా చేయనున్నాడు. అయితే బయట సినిమాలు కాదని ముందుగా తన చిత్రం సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలనే విశ్వక్ ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.