కోపా అమెరికా కప్ లో బ్రెజిల్ బోణీ

  • బొలీవియాపై సాంబా టీమ్ 3-0 విజయం

లాటిన్ అమెరికా సాకర్ సంరంభం కోపా అమెరికాకప్ గ్రూప్- ఏ లీగ్ పోటీలో ఆతిథ్య బ్రెజిల్ తొలివిజయంతో శుభారంభం చేసింది.
హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఎనిమిదిసార్లు చాంపియన్ బ్రెజిల్… ప్రారంభ మ్యాచ్ లో బొలీవియాను 3-0 గోల్స్ తో చిత్తు చేసింది.

శావోపాలో స్టేడియం వేదికగా ముగిసిన ఈ పోటీలో బ్రెజిల్ తరపున కోటినో రెండుగోల్స్ సాధించడం ద్వారా తనజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.

మూడువారాలపాటు సాగే ఈ టోర్నీలో 12 దేశాలకు చెందిన జట్లు తలపడుతున్నాయి. నాలుగు గ్రూపుల లీగ్ కమ్ సెమీఫైనల్స్ నాకౌట్ గా పోటీలను నిర్వహిస్తున్నారు.

స్టార్ స్ట్రయికర్ నైమార్ లేకుండానే బ్రెజిల్ టైటిల్ వేటకు దిగింది. గతంలో ఆతిథ్యమిచ్చిన నాలుగుసార్లు బ్రెజిల్ విజేతగా నిలవడం విశేషం.