ఆ ఎఫెక్ట్ తో…. క్రిష్ రూటు మార్చుకుంటున్నాడా?

గత కొంతకాలంగా స్టార్ దర్శకుడు క్రిష్ పరిస్థితి ఏమంత బాగాలేదు. ఒకవైపు బాలీవుడ్ లో ‘మణికర్ణిక’ సినిమా దర్శకత్వం క్రెడిట్స్ గురించి జరిగిన గొడవ అందరికీ తెలిసిందే.

మరోవైపు తెలుగులో క్రిష్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండు భాగాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక ఈ దర్శకుడు తర్వాత సినిమా ఏంటి అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో క్రిష్ ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ బాగానే నడుస్తోంది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నాయి.

ఈ నేపథ్యంలో లో క్రిష్ కూడా ఒక వెబ్ సిరీస్ ను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఒక వెబ్ సిరీస్ ను నిర్మించనుంది. క్రిష్ స్వయంగా ఈ వెబ్ సిరీస్ కు కథను, డైలాగులను అందించారు.

అయితే ఈ వెబ్ సిరీస్ కు క్రిష్ స్వయంగా దర్శకత్వం వహిస్తారా లేక వేరే దర్శకుడిని తీసుకుంటారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి కాస్ట్ అండ్ క్రూ ని ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ కాకుండా క్రిష్ చేతిలో మరొక రెండు సినిమాలు ఉన్నాయి. వాటి గురించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.