ప్రపంచకప్ లో పాక్ పై భారత్ దే పైచేయి

  • వన్డే క్రికెట్లో భారత్ పై పాక్ దే ఆధిపత్యం
  • ప్రపంచకప్ లో పాక్ పై భారత్ కు ఆరుకు ఆరు విజయాలు

ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో రెండుసార్లు చాంపియన్ భారత్, ఒక్కసారి విజేత పాక్. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ రెండోస్థానంలో ఉంటే.. పాక్ మాత్రం ఆరోస్థానంలో కొనసాగుతోంది.

అయితే…ఈ రెండుజట్లకూ చిరకాల ప్రత్యర్థులుగా, దాయాదులుగా గొప్ప రికార్డే ఉంది. 1978 నుంచి భారత్, పాక్ జట్లు వన్డే క్రికెట్లో తలపడుతూ వస్తున్నాయి.

భారత్ పై 73 విజయాల పాక్…

వన్డే క్రికెట్లో 1978 నుంచి 2018 వరకూ భారత్, పాక్ జట్లు 131 మ్యాచ్ ల్లో ఢీ కొంటే…పాక్ జట్టు 73 విజయాలు, భారత్ 54 విజయాలు సాధించగా.. మరో నాలుగు మ్యాచ్ లు ఫలితం తేలకుండానే ముగిశాయి.

ప్రపంచకప్ లో తిరుగులేని భారత్

1975 ప్రారంభ ప్రపంచకప్ నుంచి 2015 ప్రపంచకప్ వరకూ…పాక్ తో ఆడిన ఆరుకు ఆరుమ్యాచ్ ల్లోనూ భారతజట్టే విజేతగా నిలిచింది.నూటికి నూరుశాతం విజయాలు నమోదు చేసింది.

వరుణుడు కరుణించి…ప్రస్తుత ప్రపంచకప్ మ్యాచ్ సజావుగా సాగితే…పాక్ పై భారత్ ఏడో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.