Telugu Global
NEWS

ప్రపంచ హాకీ సిరీస్ ఫైనల్స్ విజేత భారత్

భారత్ కు టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీ బెర్త్  ఫైనల్లో సౌతాఫ్రికా పై 5-1 గోల్స్ తో భారత్ గెలుపు ఎనిమిదిసార్లు ఒలింపిక్ చాంపియన్ భారత్…2020 టోక్యో ఒలింపిక్స్ అర్హత హాకీ టోర్నీలో బెర్త్ ఖాయం చేసుకొంది. భువనేశ్వర్ వేదికగా ముగిసిన ఎనిమిది దేశాల ప్రపంచ హాకీ సిరీస్ ఫైనల్స్ టైటిల్ ను ఆతిథ్య భారత్ అలవోకగా గెలుచుకొంది. భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన టైటిల్ సమరంలో భారత్ 5-1 గోల్స్ తో సౌతాఫ్రికాను చిత్తు […]

ప్రపంచ హాకీ సిరీస్ ఫైనల్స్ విజేత భారత్
X
  • భారత్ కు టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీ బెర్త్
  • ఫైనల్లో సౌతాఫ్రికా పై 5-1 గోల్స్ తో భారత్ గెలుపు

ఎనిమిదిసార్లు ఒలింపిక్ చాంపియన్ భారత్…2020 టోక్యో ఒలింపిక్స్ అర్హత హాకీ టోర్నీలో బెర్త్ ఖాయం చేసుకొంది. భువనేశ్వర్ వేదికగా ముగిసిన ఎనిమిది దేశాల ప్రపంచ హాకీ సిరీస్ ఫైనల్స్ టైటిల్ ను ఆతిథ్య భారత్ అలవోకగా గెలుచుకొంది.

భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన టైటిల్ సమరంలో భారత్ 5-1 గోల్స్ తో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. మొత్తం టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా అజేయంగా నిలిచింది.

భారత్ తనకు లభించిన మొత్తం ఐదు పెనాల్టీకార్నర్లలో మూడింటిని గోల్స్ గా మలచుకోగలిగింది. భారత ఆటగాళ్లలో వరుణ్ ఆట 2, 49 నిముషాలోనూ, ఆట 11వ నిముషంలో పెనాల్టీ కార్నర్, 25వ నిముషంలో పెనాల్టీ స్ట్రోక్ ల ద్వారా హర్మన్ ప్రీత్ సింగ్ గోల్స్ సాధించగా.. 35వ నిముషంలో వివేక్ సింగ్ ప్రసాద్ ఐదోగోల్ సాధించాడు.

సౌతాఫ్రికా తరపున ఆట 53వ నిముషంలో రిచర్డ్ పాజ్ గోల్ చేయడం ద్వారా భారత్ ఆధిక్యాన్ని 5-1కు తగ్గించగలిగాడు. ఈ టోర్నీలో విజేతగా, రన్నరప్ గా నిలిచిన భారత్, సౌతాఫ్రికా జట్లు…ఒలింపిక్స్ అర్హత టోర్నీకి బెర్త్ లు సంపాదించాయి.

First Published:  16 Jun 2019 12:50 AM GMT
Next Story