బన్నీ సినిమా పై క్లారిటీ ఇచ్చిన కాజల్

ఈ మధ్య స్టార్ హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్స్ లో ఆడిపాడుతున్న సంగతి తెలిసిందే. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు తమన్నా అయితే తర్వాత వచ్చే పేరు కాజల్ అగర్వాల్. ఇప్పటికే ‘పక్కా లోకల్’ పాటలో కాజల్ డ్యాన్స్ ను అభిమానులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు.

తాజాగా కాజల్ అగర్వాల్ రెండవ సారీ ఐటెం సాంగులో కనిపించబోతోంది అని వార్తలు బయటకు వస్తున్నాయి. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

పూజా హెగ్డే, నివేద పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఐటెం సాంగులో కనిపించబోతోంది అని వార్తలు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. తాజాగా కాజల్ అగర్వాల్ త్రివిక్రమ్ కానీ చిత్ర యూనిట్ నుంచి ఎవరు ఇప్పటిదాకా తనను ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది.

ఇంతకుముందు కాజల్ అగర్వాల్ అల్లు అర్జున్ తో ‘ఆర్య 2’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరు జంటగా ‘ఎవడు’ సినిమాలో కూడా కొంత భాగం కనిపిస్తారు.