Telugu Global
NEWS

కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.... తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ కు నూకలు చెల్లినట్లే...!

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవితవ్యం లేదని, భారతీయ జనతా పార్టీ దే భవిష్యత్తు అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేదని, ముందున్న రోజులన్నీ భారతీయ జనతా పార్టీవేనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా, పిసిసి అధ్యక్షుడు […]

కోమటిరెడ్డి  సంచలన వ్యాఖ్యలు.... తెలుగు రాష్ట్రాలలో  కాంగ్రెస్ కు నూకలు చెల్లినట్లే...!
X

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవితవ్యం లేదని, భారతీయ జనతా పార్టీ దే భవిష్యత్తు అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నల్గొండలో ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేదని, ముందున్న రోజులన్నీ భారతీయ జనతా పార్టీవేనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలే కారణమని ఘాటుగా విమర్శించారు రాజగోపాల రెడ్డి.

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎదుగుతుందని, ఇతర పార్టీలు ఆ స్థానాన్ని భర్తీ చేయలేవని కోమటిరెడ్డి చెప్పారు.

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

భువనగిరి లోక్ సభ స్ధానం నుంచి ఎన్నికైన రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతారంటూ గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాను పార్టీ మారేది లేదని, బిజెపిలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు.

జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హైదరాబాద్ లో కూర్చుని కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని వస్తున్న వార్తలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. ఈ నేపథ్యంలో శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ పాలనను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉందని రాజగోపాల రెడ్డి అన్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలోకి 12 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు వెళ్లిపోయినా… వారిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడ్డుకోలేకపోయిందని కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నానాటికి బలహీనమవుతోందని, తెలుగు రాష్ట్రాలలో ఈ పార్టీకి నూకలు చెల్లినట్లేనని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్ లో స్పందించారు.

రాజగోపాల రెడ్డి వంటి నాయకులు బీజేపీలోకి వస్తే మంచిదేనని, ఆయన రాకను పార్టీ స్వాగతిస్తుందని అన్నారు. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని రాజగోపాల రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని ఆయన అన్నారు.

First Published:  15 Jun 2019 9:38 PM GMT
Next Story