Telugu Global
National

జ‌గ‌న్ బాట‌లో క‌న్న‌డ పొలిటిక‌ల్ స్టార్ !

ఏపీలోనే కాదు. ద‌క్షిణాదిలో ఇప్పుడు జ‌గ‌న్ మేనియా న‌డుస్తోంది. తొమ్మిదేళ్ల‌లో ఆయ‌న ప‌డ్డ క‌ష్టాలు, పాద‌యాత్ర, 151 సీట్ల బంప‌ర్ మెజార్టీతో సీఎం కావ‌డం… ఇప్పుడు ఈ అంశాల‌న్నీ ద‌క్షిణాది రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. జ‌గ‌న్ విజ‌య‌ సూత్రాలను పాటించేందుకు అప్‌క‌మింగ్ పొలిటిషియ‌న్స్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆరే కాదు…. త‌మిళ‌నాడు డీఎంకే నేత స్టాలిన్ కూడా వ‌చ్చారు. ఆయ‌న త‌న వెంట కుమారుడు ఉద‌యనిధిని కూడా తీసుకువ‌చ్చారు. జ‌గ‌న్‌కు […]

జ‌గ‌న్ బాట‌లో క‌న్న‌డ పొలిటిక‌ల్ స్టార్ !
X

ఏపీలోనే కాదు. ద‌క్షిణాదిలో ఇప్పుడు జ‌గ‌న్ మేనియా న‌డుస్తోంది. తొమ్మిదేళ్ల‌లో ఆయ‌న ప‌డ్డ క‌ష్టాలు, పాద‌యాత్ర, 151 సీట్ల బంప‌ర్ మెజార్టీతో సీఎం కావ‌డం… ఇప్పుడు ఈ అంశాల‌న్నీ ద‌క్షిణాది రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. జ‌గ‌న్ విజ‌య‌ సూత్రాలను పాటించేందుకు అప్‌క‌మింగ్ పొలిటిషియ‌న్స్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆరే కాదు…. త‌మిళ‌నాడు డీఎంకే నేత స్టాలిన్ కూడా వ‌చ్చారు. ఆయ‌న త‌న వెంట కుమారుడు ఉద‌యనిధిని కూడా తీసుకువ‌చ్చారు. జ‌గ‌న్‌కు కొడుకును ప‌రిచ‌యం చేశారు. రాబోయే రోజుల్లో అంటే కనీసం ఇంకో 10 ఏళ్ల పాటు ఏపీలో జ‌గ‌న్ చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతాయి.

దీంతో ప‌క్క రాష్ట్రంలో ఉండే రాజ‌కీయ నేత‌లు త‌న కొడుకులకు జగన్ తో ఎప్పటికైనా అవ‌స‌రం అని భావించి వాళ్ళను జగన్ కు పరిచయం చేస్తున్నారు. అంతేకాకుండా చిన్న వయసులోనే సీఎం అయ్యారు. దీంతో జ‌గ‌న్‌తో రిలేష‌న్ కోసమే ఉద‌య‌నిధిని తీసుకొచ్చిన‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు క‌ర్నాట‌క సీఎం కుమార‌స్వామి జ‌గ‌న్‌ను శనివారం క‌లిశారు. రాజ‌కీయాల గురించి మాట్లాడారు. ఇటు ఆయ‌న కొడుకు నిఖిల్ కుమార‌స్వామి రెండు రోజుల కింద‌ట అమ‌రావ‌తి వ‌చ్చారు. జ‌గ‌న్‌ను క‌లిశారు. చాలా సేపు మాట్లాడారు.

నిఖిల్ ఇటీవ‌లే మాండ్యా నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌ప్ప‌టి హీరోయిన్ సుమ‌ల‌త పోటీ చేసి గెలిచారు. అయితే ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మితో నిఖిల్‌ ఓ గుణ‌పాఠం నేర్చుకున్నార‌ట‌. దీంతో జ‌గ‌న్‌ను ఓ రోల్‌మోడల్‌గా తీసుకుందామ‌ని ఆయ‌న్ని క‌లిశార‌ని క‌న్న‌డ మీడియాలో వార్త‌లు షికారు చేస్తున్నాయి.

మాండ్యా ఎన్నిక‌ల్లో ల‌క్షా 25 వేల ఓట్ల తేడాతో నిఖిల్ కుమార‌స్వామి ఓడిపోయారు. ఈ ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జ‌గ‌న్‌ను క‌లిసిన‌ట్లు స‌మాచారం.

జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డంపై నిఖిల్ త‌న ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. జ‌గ‌న్ అన్న తన‌కు రాజ‌కీయాల గురించి చాలా బాగా వివ‌రించార‌ని… గెలుపోట‌ముల‌ను ప‌ట్టించుకోకుండా ప్ర‌జ‌ల్లో ఉండ‌డంపై దృష్టిపెట్టాల‌ని సూచించార‌ని చెప్పారు.

జేడీఎస్‌కు ప్ర‌స్తుతం మైసూరు ప్రాంతంలోనే పట్టు ఉంది. దీంతో క‌ర్నాట‌క మొత్తం పార్టీని విస్త‌రించేందుకు నిఖిల్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం జగన్ ను నిఖిల్ కలిసిన‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్‌ను రోల్‌మోడ‌ల్‌గా తీసుకుని రాబోయే రోజుల్లో క‌ర్నాట‌క‌లో ఆయ‌న పాద‌యాత్ర‌కు ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

First Published:  15 Jun 2019 10:34 PM GMT
Next Story