గ్లాస్ బ్లాస్ట్…. సందీప్ కిషన్ కు గాయాలు… కానీ….

కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న యువ హీరో సందీప్ కిషన్ తాజాగా ‘మనసుకు నచ్చింది’, ‘నెక్స్ట్ ఏంటి’ సినిమాలతో రెండు డిజాస్టర్ లను అందుకున్నారు. ఇక ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా ‘తెనాలి రామకృష్ణ’ సినిమాపైనే పెట్టుకున్నాడు సందీప్ కిషన్.

ఇప్పటికే బోలెడు కామెడీ సినిమాలు తెరకెక్కించిన అనుభవం ఉన్న జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. కానీ షూటింగ్ లొకేషన్ లో ఒక అనుకోని సంఘటన జరగడంతో సందీప్ కిషన్ తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.

ప్రస్తుతం కర్నూలు లో ఉన్న ఈ చిత్ర బృందం కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫైట్ మాస్టర్ వల్ల జరిగిన ఒక్క తప్పు వల్ల లొకేషన్ లో గ్లాస్ బ్లాస్ట్ జరిగింది.

Hey guys..it was an unfortunate accident in a glass blast sequence..A metal particle was stuck in my face right under…

Posted by Sundeep Kishan on Saturday, 15 June 2019

ఈ గ్లాస్ బ్లాస్ట్ లో సందీప్ కిషన్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం కర్నూల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యాడు.

“హే గైస్. దురదృష్టవశాత్తు జరిగిన గ్లాస్ బ్లాస్ట్ అది. నా మొహం మీద ఎడమ కంటి కింద ఒక మెటల్ పార్టికల్ గుచ్చుకుంది. బ్లడ్ ఎక్కువ పోవడంతో అందరూ కంగారు పడ్డారు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. నాకంటే స్టంట్ మ్యాన్ కి ఎక్కువ దెబ్బలు తగిలాయి.ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని పోస్ట్ చేశాడు సందీప్ కిషన్.