Telugu Global
NEWS

అత్యంత వేగంగా 11వేల పరుగుల విరాట్ కొహ్లీ

మాస్టర్ సచిన్ రికార్డును అధిగమించిన విరాట్  222 ఇన్నింగ్స్ లోనే విరాట్ కొహ్లీ 11వేల పరుగులు భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ వన్డే క్రికెట్లో మరో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా 11వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు. ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో కొహ్లీ ఈ ఘనత సాధించాడు. […]

అత్యంత వేగంగా 11వేల పరుగుల విరాట్ కొహ్లీ
X
  • మాస్టర్ సచిన్ రికార్డును అధిగమించిన విరాట్
  • 222 ఇన్నింగ్స్ లోనే విరాట్ కొహ్లీ 11వేల పరుగులు

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ వన్డే క్రికెట్లో మరో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా 11వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా నిలిచాడు.

భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు. ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో కొహ్లీ ఈ ఘనత సాధించాడు.

మాస్టర్ సచిన్ 276 ఇన్నింగ్స్ లో 11వేల పరుగులు సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పితే….ఆ రికార్డును విరాట్ కొహ్లీ కేవలం 222 ఇన్నింగ్స్ లోనే అధిగమించడం విశేషం.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 286 ఇన్నింగ్స్ లో 11వేల పరుగులు సాధించిన మొనగాళ్ల జాబితాలో మూడోస్థానంలో నిలిచాడు. సౌరవ్ గంగూలీ 288 ఇన్నింగ్స్ లో 11వేల పరుగుల రికార్డు సాధించాడు.

భారత క్రికెట్ చరిత్రలో 11వేల పరుగులు సాధించిన మూడో క్రికెటర్ గా విరాట్ కొహ్లీ రికార్డుల్లో చేరాడు. ప్రస్తుత పాక్ మ్యాచ్ వరకూ… విరాట్ కొహ్లీ ఆడిన 230 మ్యాచ్ లు, 222 ఇన్నింగ్స్ లో 41 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు సాధించడం విశేషం.

First Published:  16 Jun 2019 10:25 AM GMT
Next Story