Telugu Global
National

ఏ నిర్ణయమైనా కలిసి తీసుకోండి.. ఎంపీలకు సీఎం దిశా నిర్దేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి సమస్యల పరిష్కారానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడంతో పాటు విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పార్టీ ఎంపీలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ […]

ఏ నిర్ణయమైనా కలిసి తీసుకోండి.. ఎంపీలకు సీఎం దిశా నిర్దేశం
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి సమస్యల పరిష్కారానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడంతో పాటు విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పార్టీ ఎంపీలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశమయ్యారు. గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాలలో పార్టీ సభ్యులు ఏ విధంగా నడుచుకోవాలో చెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు ఎలాంటి అనుమానాలు వచ్చినా, సమస్యలు ఎదురైనా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, ఆ పార్టీ లోక్ సభ నేత మిథున్ రెడ్డిలను సంప్రదించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు.

ఆంధ్రప్రదేశ్ లో వివిధ సమస్యలు రాజ్యమేలుతున్నాయని, సమస్యల పరిష్కారం కోసం శాఖల వారీగా ఆయా మంత్రులను కలుసుకుని వాటికి పరిష్కారం దొరికేలా చర్యలు తీసుకోవాలని ఎంపీలకు సిఎం దిశానిర్దేశం చేశారు.

కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ ధోరణి కాకుండా స్నేహ పూర్వకంగా మెలుగుతూనే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది లోక్ సభ సభ్యులతో పాటు పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు బిజీబిజీగా గడిపిన జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ చేరుకుంటారు.

First Published:  16 Jun 2019 12:54 AM GMT
Next Story