Telugu Global
Cinema & Entertainment

వరుస ఫ్లాప్ లు.... అయినా ఎక్కడా తగ్గడం లేదు...!

బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవలే సీత అనే చిత్రం తో పరాజయం చవి చూసినా, తన తదుపరి చిత్రాల విషయంలో ఏ మాత్రం రాజీ పడడం లేదు. ఒక వైపు ఫ్లాపులని మూట గట్టుకుంటున్నప్పటికీ, మరో వైపు తన సినిమా లకి బిజినెస్ మాత్రం అసలు ఎక్కడా కూడా ఆగడం లేదు. సీత పరాజయం తర్వాత ఏ మాత్రం నిరుత్సాహపడకుండా ప్రస్తుతం తన తదుపరి చిత్రం రాక్షసుడు పైన బెల్లంకొండ శ్రీనివాస్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా కి […]

వరుస ఫ్లాప్ లు.... అయినా ఎక్కడా తగ్గడం లేదు...!
X

బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవలే సీత అనే చిత్రం తో పరాజయం చవి చూసినా, తన తదుపరి చిత్రాల విషయంలో ఏ మాత్రం రాజీ పడడం లేదు. ఒక వైపు ఫ్లాపులని మూట గట్టుకుంటున్నప్పటికీ, మరో వైపు తన సినిమా లకి బిజినెస్ మాత్రం అసలు ఎక్కడా కూడా ఆగడం లేదు.

సీత పరాజయం తర్వాత ఏ మాత్రం నిరుత్సాహపడకుండా ప్రస్తుతం తన తదుపరి చిత్రం రాక్షసుడు పైన బెల్లంకొండ శ్రీనివాస్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా కి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా, కోనేరు సత్యనారాయణ నిర్మాత గా వ్యవహరించారు.

తమిళం లో పెద్ద విజయం సాధించిన రాట్ససన్ అనే సినిమా కి తెలుగు లో రీమేక్ గా వస్తుంది ఈ చిత్రం. తమిళం లో అమలా పాల్ హీరోయిన్ గా నటించగా, తెలుగు లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా కి సంబందించిన డబ్బింగ్ మరియు సాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోయాయి అని తెలుస్తుంది. అయితే హిందీ లో కూడా ఈ సినిమా డబ్బింగ్ కి మంచి ధర పలికింది అని తెలుస్తుంది.

హిందీ డబ్బింగ్ రైట్స్ ని 12.5 కోట్లకి అమ్మగా, సాటిలైట్ రైట్స్ 6 కోట్లకి అమ్మారట. ఈ సినిమా ఎంత మేరకు విజయం సాధిస్తుంది అనేది మనం వేచి చూడాలి.

First Published:  17 Jun 2019 3:14 AM GMT
Next Story