డిజాస్టర్ అని ఒప్పుకున్న మరో హీరో

తమ సినిమాలు ఫెయిల్ అయితే ఒకప్పటిలా తప్పించుకు తిరగడం లేదు హీరోలు. ఆ విషయాన్ని ఓపెన్ గానే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి కార్తికేయ కూడా చేరాడు. రీసెంట్ గా అతడు నటించిన హిప్పీ సినిమా డిజాస్టర్ అయింది. ఆ విషయాన్ని కార్తికేయ అంగీకరించాడు. మరీ డిజాస్టర్ అని చెప్పకపోయినా నిరాశపరిచిందని చెప్పుకొచ్చాడు.

“కేవలం ఓ సెక్షన్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని హిప్పీ తీశాం. కుటుంబం మొత్తానికీ నచ్చేయాలనే ఆశ మాకు లేదు. కానీ దురదృష్టం ఏంటంటే.. మేం టార్గెట్ చేసిన ప్రేక్షకులకు కూడా ఆ సినిమా నచ్చలేదు. ఒక ప్రయత్నం చేశాం, ఫెయిల్ అయ్యాం. ఈసారి మరింత గట్టిగా ప్రయత్నిస్తాం.” ఇలా హిప్పీ సినిమా ఫ్లాప్ అనే విషయాన్ని అంగీకరించాడు కార్తికేయ.

రీసెంట్ గా వచ్చిన వినయవిధేయ రామ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందనే విషయాన్ని రామ్ చరణ్ అంగీకరించాడు. కేవలం ఒప్పుకోవడమే కాదు, ప్రేక్షకులు, అభిమానులు క్షమించాలంటూ ఏకంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఆమధ్య నోటా ఫ్లాప్ అయినప్పుడు కూడా విజయ్ దేవరకొండ అలానే రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు కార్తికేయ కూడా ఈ లిస్ట్ లోకి చేరాడు. అతడు నటించిన గుణ369 సినిమా విడుదలకు సిద్ధమైంది.