Telugu Global
NEWS

ప్రపంచకప్ లో పాక్ పై తిరుగులేని భారత్

మాంచెస్టర్ పోరులో భారత్ 89 పరుగుల విజయం డక్ వర్త్- లూయిస్ విధానం ద్వారా ఫార్సుగా ముగిసిన మ్యాచ్ ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా మాజీ చాంపియన్ భారత్ తనకు తిరుగేలేదని మరోసారి చాటుకొంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ముగిసిన ఏకపక్ష పోరులో…భారత్ డక్ వర్త్-లూయిస్ విధానం ద్వారా 89 పరుగుల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. భారత్ విజయంలో ప్రధాన పాత్ర వహించిన సెంచరీ హీరో రోహిత్ శర్మకు ప్లేయర్ […]

ప్రపంచకప్ లో పాక్ పై తిరుగులేని భారత్
X
  • మాంచెస్టర్ పోరులో భారత్ 89 పరుగుల విజయం
  • డక్ వర్త్- లూయిస్ విధానం ద్వారా ఫార్సుగా ముగిసిన మ్యాచ్

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా మాజీ చాంపియన్ భారత్ తనకు తిరుగేలేదని మరోసారి చాటుకొంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ముగిసిన ఏకపక్ష పోరులో…భారత్ డక్ వర్త్-లూయిస్ విధానం ద్వారా 89 పరుగుల తేడాతో పాక్ ను చిత్తు చేసింది.

భారత్ విజయంలో ప్రధాన పాత్ర వహించిన సెంచరీ హీరో రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

వానదెబ్బతో ….

వాతావరణశాఖ హెచ్చరికలు… అడదడపా చిరుజల్లుల నడుమ సాగిన ఈ పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగుల భారీస్కోరు సాధించింది.

ఓపెనర్లు రోహిత్ శర్మ- రాహుల్ మొదటి వికెట్ కు రికార్డు భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. రాహుల్ 57, రోహిత్ శర్మ 140, కెప్టెన్ విరాట్ కొహ్లీ 77 పరుగుల స్కోర్లు సాధించారు.

పాక్ డక్… భారత్ వర్త్..

337 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు లక్ష్యంగా చేజింగ్ కు దిగిన పాక్ జట్టు…వర్షంతోమ్యాచ్ నిలిపివేసే సమయానికి 35 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. వర్షం తగ్గడంతో …డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం…పాకిస్థాన్ చివరి 5 ఓవర్లలో 136 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరకు పాక్ జట్టు 40 ఓవర్లలో 212 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ..భారత్ ను 89 పరుగులతో నెగ్గినట్లు ప్రకటించారు.

ప్రస్తుత ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ ఆడిన మొదటి నాలుగురౌండ్లలో ఇది వరుసగా మూడో గెలుపు కాగా..ఏడు పాయింట్లతో.. లీగ్ టేబుల్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

పాక్ ప్రత్యర్థిగా ప్రపంచకప్ లో ఆడిన ఏడుకు ఏడు మ్యాచ్ ల్లోనూ భారత్ తిరుగులేని విజయాలతో ఆధిక్యాన్ని కొనసాగించగలిగింది.

First Published:  17 Jun 2019 12:45 AM GMT
Next Story