హాలిడే ట్రిప్ అయిపోయింది….

ఈ మధ్యనే ‘మహర్షి’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ హాలిడే కోసం వెళ్లిన సంగతి తెలిసిందే.

మహేష్ బాబు, నమ్రత, గౌతమ్, సితార జర్మనీ మరియు లండన్ లను కూడా పర్యటించి స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్ కు సైతం హాజరయ్యారు. తాజాగా వెకేషన్ పూర్తి చేసుకుని మహేష్ తన కుటుంబ సభ్యులతో ఇవ్వాళ మళ్లీ హైదరాబాద్ కు చేరుకున్నారు.

ఇక సినిమాల పరంగా చూస్తే మహేష్ బాబు ఈ మధ్యనే ‘ఎఫ్ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు మరియు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరి ఈ సినిమాతో మహేష్ బాబు తన విన్నింగ్ స్ట్రీక్ ను కొనసాగిస్తాడా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.