యోగికి మోడీ వార్నింగ్…. ఆ సమస్యపై ఫోకస్

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం యూపీనే.. పోయినసారి 70కు పైగా సీట్లు ఇచ్చిన యూపీ ప్రజలు.. ఈసారి 62 ఎంపీ సీట్లు ఇచ్చి కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారణమైంది.

కేంద్రంలో అధికారంలోకి రావడానికి యూపీనే రహదారి. అందుకే యూపీపై అన్ని పొలిటికల్ పార్టీలు దృష్టి సారిస్తాయి. ఆ కోవలోనే బీజేపీ ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టింది. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ.. తనను ప్రధానిగా కూర్చుండబెట్టిన యూపీ ప్రజల రుణం తీర్చుకునేందుకు రెడీ అయ్యారు.

తాజాగా యూపీ సీఎం యోగికి ఒక లేఖ ద్వారా మోడీ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కూడా సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు.

యూపీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ నేపథ్యంలో యూపీలో తీవ్రంగా ఉన్న నీటి సమస్యను తీర్చాలని యోగికి లేఖలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా సరే యూపీలో గెలవాలని స్కెచ్ గీస్తున్న బీజేపీ అందులో భాగంగానే ఆరాష్ట్రంపై ఫోకస్ పెట్టింది.

తాజాగా యూపీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. అందుకే మోడీనే రంగంలోకి దిగారు. బుందేల్ ఖండ్, విద్యాంచల్ లో నీటి సమస్యను, మౌలిక వసతులను కల్పించాలని యూపీ సీఎంను మోడీ ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల లోపు ఈ సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు.