అక్క డైరెక్టర్…. తమ్ముడు ప్రొడ్యూసర్…. ‘అనగనగా ఒక నాన్న’

‘డీ ఫర్ దోపిడీ’ అనే సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించిన నాచురల్ స్టార్ నాని గతేడాది విడుదలైన ‘అ!’ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ హీరోగా బిజీ అయిపోయిన నాని ఈ మధ్యనే ‘జెర్సీ’ అనే సినిమాతో హిట్ అందుకున్నాడు.

నాని ఇప్పుడు షార్ట్ ఫిలింస్ పై దృష్టి పెట్టారని తెలుస్తోంది. నాని వాళ్ల అక్క దీప్తి గంట ఒక షార్ట్ ఫిలిం చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చిన ఈమె ఫాదర్స్ డే సందర్భంగా ‘అనగనగా ఒక నాన్న’ అనే షార్ట్ ఫిలింకి స్క్రిప్ట్ అందించడమే కాక దర్శకత్వం కూడా వహించారు. నాని ఈ షార్ట్ ఫిలింకు నిర్మాతగా వ్యవహరించాడు.

12 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిలిం లో బేబీ వంశిక రెడ్డి, టి ఎన్ ఆర్, సీమా చౌదరి, కె ఎల్ కె మణమ్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఆఖరిలో టైటిల్ క్రెడిట్స్ కూడా అయిపోయాక నాని ఈ షార్ట్ ఫిలిం లో సర్ ప్రైజ్ అప్పియరెన్స్ ఇచ్చాడు.

టైటిల్ కు తగ్గట్టు గానే ఫాదర్స్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం షార్ట్ ఫిలిం తండ్రీ, పిల్లల మధ్య ప్రేమ గురించి, ఎమోషనల్ రిలేషన్ షిప్ గురించి చాలా బాగా చూపించారు. యూట్యూబ్ లో కూడా…. షార్ట్ ఫిలిం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.