ఎవరో చేసిన తప్పుకు…. కార్తికేయ ఇబ్బందుల్లో పడనున్నాడా?

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తికేయ ఈ మధ్యనే విడుదలైన ‘హిప్పీ’ తో అంతగా మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే.

తాజాగా ‘గుణ 369’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు కార్తికేయ. అర్జున్ జంధ్యాల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇవాళ ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో చూస్తే ఈ సినిమాలో కార్తికేయ ఒక కామన్ మాన్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

“మన తప్పుల వల్ల మన జీవితానికి హాని జరిగినా పర్వాలేదు… కానీ వేరేవాళ్ళ జీవితానికి ఏ హాని జరగకూడదు” అంటూ సాయికుమార్ చెప్పే డైలాగ్ తో ఈ సినిమా టీజర్ మొదలవుతుంది.

ఈ సినిమా టీజర్ చూస్తే గుణ పాత్రలో నటించిన కార్తికేయ ఎవరో చేసిన తప్పు వల్ల ఇబ్బందుల్లో పడతాడు అని అర్థం అవుతోంది. అనాఘ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ లోనే వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది.

చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ గా మారబోతోందని చెప్పుకోవచ్చు. ఎస్ జీ మూవీ మేకర్స్ పతాకంపై తిరుమల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.