ఈ కాంబినేషన్.. ఎంతో ప్రత్యేకం

కొన్ని కాంబినేషన్లు అలా వింటేనే చాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి ఓ డిఫరెంట్ కాంబినేషన్ త్వరలోనే కలవబోతోంది. ఫీల్ గుడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన శేఖర్ కమ్ముల … లవ్ స్టోరీస్ కి పర్ఫెక్ట్ అనిపించే అక్కినేని నాగచైతన్య… పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసే సాయి పల్లవి…. ఈ ముగ్గురూ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్ ఊపేస్తోంది.

నిజానికి ఓ సినిమా కంప్లీట్ అయ్యేంతవరకు మరో సినిమా గురించి ఆలోచించడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం నూతన నటీనటుల్ని పరిచయం చేస్తూ ఈ దర్శకుడు ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ అంతలోనే ఈ వార్త బయటకు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది

ఇంతకీ మేటర్ ఏంటంటే.. చాన్నాళ్ల కిందటే నాగచైతన్యకు ఓ లైన్ చెప్పాడట కమ్ముల. దానికి చైతూ ఓకే కూడా చెప్పేశాడు. ఇప్పుడదే స్టోరీకి సాయిపల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అందుకే ఈ వార్త మరోసారి బయటకొచ్చింది. త్వరలోనే ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వస్తుందంటూ అక్కినేని కాంపౌండ్ నుంచి ఫీలర్లు వస్తున్నాయి. ఫిదా సినిమాతో సాయిపల్లవికి శేఖర్ కమ్ముల స్టార్ స్టేటస్ ఇచ్చిన సంగతి తెలిసిందే.