రణరంగం టీజర్ ఎప్పుడో తెలుసా?

శర్వానంద్ ప్రధాన పాత్ర లో త్వరలో రానున్న చిత్రం రణరంగం. ఈ సినిమా ప్రమోషన్స్ విషయం లో వెనుకబడి ఉంది అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా కానీ నిన్న గాక మొన్న ఈ సినిమా టైటిల్ ని ప్రకటించారు. ఇక ప్రమోషన్స్ మొదలవుతాయి అనుకుంటే అసలు సినిమా కి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా లేదు.

అయితే ఈ విషయాన్ని ఇక పై చిత్ర యూనిట్ సీరియస్ గా తీసుకోనుందట. త్వరలో నే సినిమా కి సంబందించిన టీజర్ ని విడుదల చేసి మంచి పాజిటివ్ బజ్ తీసుకోని రావాలనే ప్లాన్ లో ఉన్నారు చిత్ర యూనిట్.

అయితే వచ్చే వారం లో ఈ సినిమా టీజర్ ని ఎట్టి పరిస్థితిలో విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ టీజర్ కట్ కి సంబందించిన పనులు ఆల్రెడీ మొదలయ్యాయట.

ఇకపోతే శర్వానంద్ ఈ సినిమా లో రెండు పాత్రల లో కనిపించనున్నాడు. గ్యాంగ్ స్టర్ పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది అని అందరూ ఇప్పటికే చెప్పుకుంటున్నారు. కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమా లో హీరోయిన్లు గా నటిస్తున్నారు.

సుధీర్ వర్మ దర్శకత్వం లో రానున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.