స్టుడియో రౌండప్ (17-06-2019)

సైరా

చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ సినిమా సైరా. రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇవాళ్టి నుంచి ఓ కొత్త దశలోకి ఎంటరైంది. అవును.. సైరా సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. చిరంజీవి ఇవాళ్టి నుంచి డబ్బింగ్ మొదలుపెట్టారు. మరోవైపు నానక్ రామ్ గూడలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ కూడా నడుస్తోంది.

సాహో

ప్రస్తుతం సాహో యూనిట్ యూరోప్ లో షూటింగ్ చేస్తోంది. రీసెంట్ గా ఓ సాంగ్ షూట్ పూర్తిచేసిన యూనిట్, ఇప్పుడు ఆస్ట్రియా చేరుకుంది. ఆ దేశంలోని ఇన్స్ బ్రూక్ నగరంలో కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. బాగా ఎత్తైన కొండపై ఉన్న అందమైన చల్లని ప్రదేశం ఇది. ఇక్కడ మూవీకి సంబంధించి కొన్ని షాట్స్ తీస్తారు.

ఇస్మార్ట్ శంకర్

ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఇస్మార్ట్ శంకర్.. ఆల్రెడీ పాటలు పూర్తిచేసే పనిలో పడిన విషయం తెలిసిందే. రీసెంట్ గా గోవాలో ఓ సాంగ్ ను పూర్తిచేసిన రామ్, ఇప్పుడు మాల్దీవుల్లో కూడా మరో సాంగ్ పూర్తిచేశాడు. గోవాలో నభా నటేష్ తో పాట షూటింగ్ లో పాల్గొన్న ఈ హీరో, మాల్టీవుల్లో నిధి అగర్వాల్ తో సాంగేసుకున్నాడు. వచ్చేనెల 12న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

గ్యాంగ్ లీడర్

దేశరాజధాని ఢిల్లీలో ఇవాళ్టి నుంచి గ్యాంగ్ లీడర్ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ షూట్ లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లాడు నాని. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాల్ని ఢిల్లీలో షూట్ చేయబోతున్నారు. నెలాఖరు నుంచి హైదరాబాద్ లోనే మరో షెడ్యూల్ ఉంటుంది. ఆగస్ట్ 30న సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

కల్కి

రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఈరోజు గుమ్మడికాయ కొట్టారు. అన్నపూర్ణ స్టుడియోస్ లో జరిగిన చిన్న ప్యాచ్ వర్క్ షూట్ తో కల్కి షూటింగ్ మొత్తం పూర్తయింది.