మోహన్ బాబు గురించి…. సూర్య ట్వీట్

ఎన్జీకె సినిమా విడుదల అయి ఫ్లాప్ అందుకుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు, హీరో సూర్య కూడా బహిరంగంగానే ఒప్పుకున్నారు.

అయితే ప్రస్తుతం సూర్య తన కొత్త చిత్రం షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. వెంకటేష్ తో గురు అనే సినిమా ని చేసిన సుధ కొంగర ఈ సినిమా కి దర్శకురాలు.

అయితే ఈ సినిమా ఎయిర్ డెక్కన్ సంస్థ ని స్థాపించిన వ్యక్తి ఆధారం గా తీయబడుతుంది అనే టాక్ నడుస్తుంది. ఈ సినిమా లో నెగటివ్ రోల్ లో మోహన్ బాబు నటించనున్నాడు. ఈ సినిమా కోసం మోహన్ బాబు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు.

అయితే మొదటి రోజు షూటింగ్ అనంతరం మోహన్ బాబు గురించి సూర్య ట్వీట్ వేశారు. మోహన్ బాబు తో పని చేయడం చాలా సంతోషం గా ఉంది అని చెప్పారు.

“మోహన్ బాబు సర్ తో పాటు సెట్స్ లో షూటింగ్ చేయడం చాలా ఆనందం గా ఉంది. ఆయన ఒక లెజెండ్. డిసిప్లైన్ కి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఒక చిన్న గారేజ్ లో పని చేయడం నుంచి 500 కు పైగా సినిమా లు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో స్ఫూర్తిదాయకం గా ఉంది ఆయన జీవితం. ఆయన తో పని చేయడం గొప్ప అనుభూతి ని ఇచ్చే విషయం. మా సూరారై పొట్రు సినిమా లో పని చేస్తున్నందుకు ధన్యవాదాలు సర్” అని సూర్య పోస్ట్ చేశారు.