Telugu Global
NEWS

ప్రపంచకప్ లో సెంచరీల మోత

మొదటి 22 మ్యాచ్ ల్లోనే 8 శతకాలు రెండేసి సెంచరీలతో రూట్, రోహిత్ టాప్  కంగారూ ఓపెనర్లు వార్నర్, ఫించ్ సెంచరీలు భారత ఓపెనర్లు రోహిత్, శిఖర్ ధావన్ శతకాలు 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ..మొదటి 22 రౌండ్ల మ్యాచ్ ల్లోనే 8 శతకాలు నమోదయ్యాయి. వెస్టిండీస్ తో ముగిసిన ప్రపంచకప్ మ్యాచ్ లో.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అజేయశతకం సాధించడం ద్వారా…ప్రస్తుత ప్రపంచకప్ లో రెండు సెంచరీలు సాధించిన తొలిఆటగాడిగా నిలిస్తే.. చిరకాల ప్రత్యర్థి […]

ప్రపంచకప్ లో సెంచరీల మోత
X
  • మొదటి 22 మ్యాచ్ ల్లోనే 8 శతకాలు
  • రెండేసి సెంచరీలతో రూట్, రోహిత్ టాప్
  • కంగారూ ఓపెనర్లు వార్నర్, ఫించ్ సెంచరీలు
  • భారత ఓపెనర్లు రోహిత్, శిఖర్ ధావన్ శతకాలు

2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ..మొదటి 22 రౌండ్ల మ్యాచ్ ల్లోనే 8 శతకాలు నమోదయ్యాయి. వెస్టిండీస్ తో ముగిసిన ప్రపంచకప్ మ్యాచ్ లో.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అజేయశతకం సాధించడం ద్వారా…ప్రస్తుత ప్రపంచకప్ లో రెండు సెంచరీలు సాధించిన తొలిఆటగాడిగా నిలిస్తే.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ తన రెండో శతకం బాదడం ద్వారా సంయుక్త అగ్రస్థానంలో నిలిచాడు.

మూడుమ్యాచ్ ల్లో 3 సెంచరీల భారత్…

ప్రస్తుత ప్రపంచకప్ లో రెండోర్యాంకర్ భారత్ ఇప్పటి వరకూ ఆడిన మూడుమ్యాచ్ ల్లో మూడు సెంచరీలు నమోదు చేసింది.
భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కలసి ప్రస్తుత ప్రపంచకప్ లో 3 సెంచరీలు సాధించారు.

సౌతాఫ్రికాతో ముగిసిన తొలిరౌండ్ పోటీలో రోహిత్ శర్మ.. మొత్తం 108 బాల్స్ లో 2 సిక్సర్లు, 10 బౌండ్రీలతో శతకం పూర్తి చేసి… చివరకు 144 బాల్స్ లో 122 పరుగుల స్కోరుతో నాటౌట్ గా మిగిలాడు.

రోహిత్ శర్మ కెరియర్ లో ఇది 23వ సెంచరీ కాగా…ప్రపంచకప్ లో తొలి శతకం కావడం విశేషం. అంతేకాదు …చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సైతం రోహిత్ 140 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా ముగిసిన నాలుగోరౌండ్ మ్యాచ్ లో రోహిత్ మూడంకెల స్కోరు సాధించాడు.
రాహుల్ తో కలసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ మొదటి వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.

మొత్తం 113 బాల్స్ లో 3 సిక్సర్లు, 14 బౌండ్రీలతో 140 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. 84 బాల్స్ లోనే వంద పరుగులు సాధించిన రోహిత్… కేవలం 34 బాల్స్ లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించడం కూడా రికార్డుగా నిలిచింది.

ఆసీస్ పై ధావన్ సెంచరీ…

ఆస్ట్రేలియాతో ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ రెండోరౌండ్ మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ స్ర్టోక్ ఫుల్ సెంచరీ సాధించడం ద్వారా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

మొత్తం మీద…భారత్ ఆడిన మూడుమ్యాచ్ ల్లో ఓపెనర్లు రోహిత్- ధావన్ …మూడు శతకాలు సాధించడం విశేషం.

జో రూట్ రెండు సెంచరీలు…

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ , వన్ డౌన్ ఆటగాడు జో రూట్ …ప్రస్తుత ప్రపంచకప్ లో రెండు సెంచరీలు సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు.

మాజీ చాంపియన్ పాకిస్థాన్ తో జరిగిన పోటీలో 107 పరుగులతో తొలిసెంచరీ సాధించిన రూట్…సౌతాంప్టన్ వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన మ్యాచ్ లో సైతం శతకం బాదాడు. రూట్ మొత్తం 94 బాల్స్ లో 11 బౌండ్రీలతో నాటౌట్ గా నిలిచాడు.

ఇంగ్లండ్ మూడు సెంచరీలు…

అంతేకాదు…ప్రపంచకప్ లో మూడు సెంచరీలు సాధించిన రెండుజట్లలో… ఇంగ్లండ్ సైతం చోటు సంపాదించింది. జో రూట్ రెండు, జేసన్ రాయ్ ఒక్క శతకం సాధించారు.

వార్నర్ ఫటాఫట్….

ఇక…పాకిస్థాన్ తో ముగిసిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనదైన స్టయిల్లో మెరుపు సెంచరీ నమోదు చేశాడు.
బాల్ టాంపరింగ్ ఆరోపణలతో ఏడాదికాలం నిషేధం ఎదుర్కొన్న వార్నర్…ప్రస్తుత ప్రపంచకప్ లో తమ జట్టు ఆడిన మూడోరౌండ్
మ్యాచ్ లోనే శతకం బాదాడు.

టాంటన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో వార్నర్ 111 బాల్స్ ఎదుర్కొని ..ఒకేఒక్క సిక్సర్, 11 బౌండ్రీలతో 107 పరుగుల స్కోరు సాధించి అవుటయ్యాడు.

ప్రస్తుత ప్రపంచకప్ లో సెంచరీబాదిన తొలి ఆస్ట్రేలియన్ క్రికెటర్ గా వార్నర్ రికార్డుల్లో చేరాడు. వార్నర్ వన్డే కెరియర్ లో ఇది 15వ సెంచరీ కావడం విశేషం.

శ్రీలంకపై ఫించ్ సెంచరీ…

మాజీ చాంపియన్ శ్రీలంకతో ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్..సునామీ సెంచరీ సాధించాడు. కేవలం 132 బాల్స్ లో 5 సిక్సర్లు, 15 బౌండ్రీలతో 153 పరుగుల స్కోరు సాధించాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ జరిగిన 22 మ్యాచ్ ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

ఓపెనర్ల సెంచరీలు ఆరు…

భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఓపెనర్లు కలసి ఆరు శతకాలు సాధిస్తే…ఇంగ్లండ్ వన్ డౌన్ ఆటగాడు జో రూట్ ఒక్కడే రెండు సెంచరీలు సాధించడం.. ఓ అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది.

First Published:  17 Jun 2019 12:55 AM GMT
Next Story