పూజ చేశారు…. కానీ షూటింగ్ మాత్రం….

కొన్ని రోజుల క్రితమే అఖిల్ అక్కినేని తన నాలుగవ చిత్రానికి సంబందించిన అధికారిక లాంచ్ లో పాల్గొన్నాడు. ఈ సినిమా ఓపెనింగ్ కి మంచి పాజిటివ్ బజ్ వచ్చింది.

సినిమా ని లాంచ్ చేసినప్పుడే చిత్ర యూనిట్ షూటింగ్ ని కూడా మొదలు పెడుతున్నట్లు ప్రేకటించారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ సినిమా ఇంకొంత ఆలస్యం గా మొదలు కానుంది అనే విషయం బయటకు వచ్చింది.

ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి అయ్యాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ పాటికే మొదలు కావాల్సిన షూటింగ్ ఈ నెల చివర్లో మొదలు కానుంది.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో త్వరలో రానున్న ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్ తన బ్యానర్ గీతా ఆర్ట్స్ మీద సమర్పిస్తుండగా, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 26 న మొదలు కానుంది. కాకపోతే ఇంకా చిత్ర యూనిట్ ఈ సినిమా లో హీరోయిన్ ని ఎంపిక చేయలేదు. గోపి సుందర్ ఈ సినిమా కి సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.