Telugu Global
National

బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జేపీ నడ్డా

భారతీయ జనతా పార్టీలో సంస్థాగత మార్పులు ప్రారంభమయ్యాయి. గత సంప్రదాయాలకు విరుద్ధంగా కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ప్రవేశపెట్టారు. ఈ పదవికి కేంద్ర మంత్రిగా పనిచేసిన జేపీ నడ్డాను నియమించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి అమిత్ షా కొనసాగుతారు. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీలో జాతీయ అధ్యక్షుడు మాత్రమే ఉండేవారు. ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లడంతో పార్టీని నడిపించే బాధ్యతలు జేపీ నడ్డాకు అప్పగించారు. కేంద్ర హోం […]

బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జేపీ నడ్డా
X

భారతీయ జనతా పార్టీలో సంస్థాగత మార్పులు ప్రారంభమయ్యాయి. గత సంప్రదాయాలకు విరుద్ధంగా కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ప్రవేశపెట్టారు. ఈ పదవికి కేంద్ర మంత్రిగా పనిచేసిన జేపీ నడ్డాను నియమించారు.

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి అమిత్ షా కొనసాగుతారు. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీలో జాతీయ అధ్యక్షుడు మాత్రమే ఉండేవారు. ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లడంతో పార్టీని నడిపించే బాధ్యతలు జేపీ నడ్డాకు అప్పగించారు.

కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా పార్టీ కార్యకలాపాలను నిర్వహించడం కష్టసాధ్యమని భావించిన బీజేపీ అధిష్టానం ఆ పనులను చేసేందుకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ప్రవేశపెట్టి ఆ పదవిలో జేపీ నడ్డాను కూర్చో పెట్టింది.

ఇది అమిత్ షా, నరేంద్ర మోడీల రాజకీయ చతురతగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో తమ పట్టు సడలకుండా ఆ ఇద్దరు నేతలు వ్యూహరచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగానే కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ప్రవేశపెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలే చక్రం తిప్పుతారు. పార్టీ కార్యకలాపాలన్నీ వారి కనుసన్నల్లోనే జరుగుతాయి.

కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జేపీ నడ్డాను నియమించిన తర్వాత జాతీయ కార్యవర్గంలో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గత ఎన్నికలలో నాయకులు ఎలా పని చేశారు, ఎవరు తమ అదుపాజ్ఞల్లో లేకుండా పని చేశారు వంటి అంశాలను పరిశీలించి జాతీయ కార్యవర్గాన్ని రూపొందిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  17 Jun 2019 8:57 PM GMT
Next Story