Telugu Global
NEWS

లోకేష్ పై హోంమంత్రి సుచరిత ఫైర్!

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి సుచరిత ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి నారా లోకేష్ వాస్తవాలు తెలియకుండా, తెలుసుకోకుండా తన ఇష్టం వచ్చినట్లుగా ట్విట్టర్ లో వ్యాఖ్యానాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. దీనిపై హోంమంత్రి సుచరిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల […]

లోకేష్ పై హోంమంత్రి సుచరిత ఫైర్!
X

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి సుచరిత ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి నారా లోకేష్ వాస్తవాలు తెలియకుండా, తెలుసుకోకుండా తన ఇష్టం వచ్చినట్లుగా ట్విట్టర్ లో వ్యాఖ్యానాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. దీనిపై హోంమంత్రి సుచరిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇటీవల జరిగిన రాజకీయ దాడులలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు 44 మంది గాయపడ్డారని, అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు 57 మంది తీవ్ర గాయాలపాలయ్యారని హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించడం సరైంది కాదని ఆమె తెలిపారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని అక్రమ కేసుల్లో ఇరికించారని, అనేకమందిని జైలు పాలు చేశారని హోంమంత్రి సుచరిత చెప్పారు. ఓ మహిళా ప్రభుత్వ అధికారిణిపై తెలుగుదేశం ఎమ్మెల్యే భౌతికంగా దాడి చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కానీ, పార్టీ నాయకులు గానీ పట్టించుకోలేదని మంత్రి గుర్తు చేశారు.

శాసనసభలో వాస్తవాలను చెబుతున్న తమ నాయకురాలు, శాసనసభ్యురాలు రోజాను సంవత్సరం పాటు శాసన సభకు రాకుండా అడ్డుకున్నారని, వీటిని గమనించిన ప్రజలు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్పారని మంత్రి వ్యాఖ్యానించారు. ఇక ముందైనా మాజీ మంత్రి నారా లోకేష్ వాస్తవాలను తెలుసుకుని ప్రకటనలు చేస్తే బాగుంటుందని హోంమంత్రి సుచరిత హితవు పలికారు.

First Published:  17 Jun 2019 9:26 PM GMT
Next Story