మెగా అల్లుడి కేసు లో పురోగతి

మెగా ఫ్యామిలీ లోకి అల్లుడు గా వెళ్ళాక కళ్యాణ్ దేవ్ కి విపరీతమైన అటెన్షన్ వచ్చి చేరింది. నటుడిగా విజేత అనే సినిమా తో అరంగేట్రం చేసిన కళ్యాణ్ ప్రస్తుతం తన రెండో సినిమా పైన దృష్టి పెట్టాడు. అదే విధం గా పర్సనల్ లైఫ్ లో కూడా తండ్రి గా ప్రమోషన్ పొందాడు.

కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, భార్య శ్రీజ తో, ఇంకా కూతుళ్ళ తో కలిసి దిగిన ఫొటోలని అప్లోడ్ చేస్తూ ఉంటాడు కళ్యాణ్. అయితే తాజాగా అయన సైబర్ క్రైం పోలీసులని ఆశ్రయించాడు.

కొంత మంది ఆకతాయిలు ఇంస్టాగ్రామ్ లో తనని కావాలని వేధిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. కావాలని అసభ్య పదజాలంతో తనని దూషిస్తున్నారని, పిచ్చిపిచ్చి గా కామెంట్స్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదు లో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు…. దీని పై విచారణ జరిపి వేధిస్తున్న వారి అకౌంట్స్ వివరాలు కోరుతూ ఇంస్టాగ్రామ్ కి లేఖ రాసినట్లు సమాచారం. అయితే ఇపుడు పోలీసులు ఈ కేసులో కొంత పురోగతి ని సాధించినట్టు సమాచారం.

ఇంస్టాగ్రామ్ నుండి పోలీసులు ఆ ఆకతాయిల వివరాలు తీసుకొని వాళ్ళని ట్రేస్ చేయడం జరిగిందట. త్వరలోనే వాళ్ళని తమ కస్టడీ లో కి తీసుకొని విచారించనున్నట్టు సమాచారం.