కొరటాలతో ఎన్టీఆర్…. ముహూర్తం అప్పుడేనట !

ఈ మధ్యన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాతో విజయాన్ని అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అతి పెద్ద మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఏ దర్శకుడితో చేయి కలపనున్నాడో అని అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతాగ్యారేజ్’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి మరో పవర్ ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారట.

ఈ చిత్రం కంటే ముందు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమాను తెరకెక్కించనున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇక ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత… ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి ఒక సినిమా చేయబోతున్నారట. ఈ సినిమాకు సంబంధించిన పనులు త్వరలో మొదలవబోతున్నట్లు తెలుస్తోంది.