ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో ఆ రోజు తెలుస్తుందట !

గత కొంత కాలం గా రాజమౌళి దర్శకత్వం లో రానున్న ఆర్ఆర్ఆర్ అనే చిత్రం గురించి చాలా వార్తలు మీడియా లో వస్తున్నాయి… కానీ దేని మీదా క్లారిటీ లేదు.

ఇప్పటికే సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులే అవుతున్నా…. అసలు ఈ షెడ్యూల్ లో ఏం సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు అనే దాని పైన కూడా ఎవరికీ ఏమి తెలియదు.

చిత్ర యూనిట్ సైలెంట్ గ వారి పని వారు చేసుకుంటూ పోతుండగా, మీడియా లో మాత్రం రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఇటీవల ఈ సినిమా గురించి వచ్చిన పుకార్ల లో ఎక్కువ శాతం సినిమా ఫస్ట్ లుక్ గురించి వచ్చినవే ఉన్నాయి.

అయితే ఈ సినిమా కి సంబందించిన ఫస్ట్ లుక్ ఇప్పుడప్పుడే బయటకు వచ్చే లా లేదు. అందరూ స్వతంత్ర దినోత్సవానికి ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారు అని అనుకుంటున్నారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల కి బదులు సినిమా టైటిల్ కి సంబందించిన ఫుల్ ఫామ్ ని అనౌన్స్ చేయాలని భావిస్తోందట. ఇప్పటికే టైటిల్ గురించి చాలా సలహాలు రాగా వాటిల్లో నుంచి ఒక దాన్ని చిత్ర యూనిట్ ఎంపిక చేసుకోవాలని చూస్తుంది.