Telugu Global
NEWS

ప్రపంచకప్ లీగ్ లో బంగ్లాదేశ్ సంచలనం

322 పరుగుల టార్గెట్ ను అలవోకగా చేధించిన బంగ్లాదేశ్  షకీబుల్ ఆల్ రౌండ్ షోలో విండీస్ గల్లంతు ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. టాంటన్ వేదికగా ముగిసిన ఐదోరౌండ్ మ్యాచ్ లో.. రెండుసార్లు విజేత వెస్టిండీస్ పై 7 వికెట్ల అలవోక విజయంతో సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకొంది. ఆల్ రౌండ్ షోతో బంగ్లా విజయంలో ప్రధానపాత్ర వహించిన స్పిన్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ కు ప్లేయర్ ఆఫ్ […]

ప్రపంచకప్ లీగ్ లో బంగ్లాదేశ్ సంచలనం
X
  • 322 పరుగుల టార్గెట్ ను అలవోకగా చేధించిన బంగ్లాదేశ్
  • షకీబుల్ ఆల్ రౌండ్ షోలో విండీస్ గల్లంతు

ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. టాంటన్ వేదికగా ముగిసిన ఐదోరౌండ్ మ్యాచ్ లో.. రెండుసార్లు విజేత వెస్టిండీస్ పై 7 వికెట్ల అలవోక విజయంతో సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకొంది.

ఆల్ రౌండ్ షోతో బంగ్లా విజయంలో ప్రధానపాత్ర వహించిన స్పిన్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ కీలక మ్యాచ్ లో నెగ్గి తీరాల్సిన విండీస్… ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. 50 ఓవర్లలో 8 వికెట్లకు 321 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఓపెనర్ ఇవిన్ లూయస్ 70, వన్ డౌన్ షియా హోప్ 96 పరుగులు, హెట్ మేయర్ 50 పరుగుల స్కోర్లు సాధించారు. బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, ముస్తాఫిజుర్ చెరో మూడు వికెట్లు, షకీబుల్ 2 వికెట్లు పడగొట్టారు.

రికార్డు చేజింగ్…

322 పరుగుల భారీటార్గెట్ తో చేజింగ్ కు దిగిన బంగ్లాదేశ్..కేవలం 41.3 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 7 వికెట్ల విజయం సొంతం చేసుకొంది.

ప్రపంచకప్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద చేజింగ్ గా రికార్డుల్లో నమోదయ్యింది.

బంగ్లా వన్ డౌన్ ఆటగాడు షకీబుల్ హసన్ 99 బాల్స్ లో 16 బౌండ్రీలతో 124 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మూడోడౌన్ ఆటగాడు లిట్టన్ దాస్ సైతం..69 బాల్స్ లో 8 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 94 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు.

షకీబుల్ అరుదైన రికార్డు…

బంగ్లాదేశ్ డాషింగ్ ఆల్ రౌండర్ ప్రస్తుత ప్రపంచకప్ మొదటి 23 మ్యాచ్ లు ముగిసే సమయానికి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో…మొత్తం 384 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ పించ్, భారత ఓపెనర్ రోహిత్ శర్మ..షకీబుల్ తర్వాతి స్థానాలలో నిలిచారు.

అంతేకాదు…వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 6 వేల పరుగులు, 200 వికెట్లు రికార్డు సాధించిన తొలి క్రికెటర్ గా షకీబుల్ చరిత్ర సృష్టించాడు.

విండీస్ పై విజయంతో బంగ్లాదేశ్..సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకోగా…విండీస్ మాత్రం లీగ్ దశ నుంచే నిష్క్రమించే ప్రమాదాన్ని కొని తెచ్చుకొంది.

First Published:  18 Jun 2019 1:55 AM GMT
Next Story