Telugu Global
NEWS

తెలంగాణ కేబినెట్ భేటీ.... 30 అంశాలపై చర్చ

వరుసగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ ప్రగతి భవన్‌లో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో 30పైగా అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. రెండు గంటలకు పైగా ఈ భేటీ జరుగనుండగా.. ఇవాళ సాయంత్రం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించనున్నారు. మంత్రివర్గం సమావేశంలో ముఖ్యంగా లక్ష రూపాయల లోపు రుణమాఫీ అమలుకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. ఇంతకు మునుపే ప్రకటించిన ఆసరా పెన్షన్ల […]

తెలంగాణ కేబినెట్ భేటీ.... 30 అంశాలపై చర్చ
X

వరుసగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ ప్రగతి భవన్‌లో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో 30పైగా అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. రెండు గంటలకు పైగా ఈ భేటీ జరుగనుండగా.. ఇవాళ సాయంత్రం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించనున్నారు.

మంత్రివర్గం సమావేశంలో ముఖ్యంగా లక్ష రూపాయల లోపు రుణమాఫీ అమలుకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. ఇంతకు మునుపే ప్రకటించిన ఆసరా పెన్షన్ల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను కేబినెట్ ఆమోదించనుంది.

ఇక 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర, ఏపీ సీఎంలు రానున్నందున…. సీఎం హోదాలో చర్చించవల్సిన అంశాలపై కేబినెట్‌లో సమీక్షించనున్నారు.

ఇక ఇప్పటికే రాష్ట్రంలో కొత్త పంచాయితీ రాజ్ చట్టం అమలులోనికి వచ్చింది. దీంతో కొత్త మున్సిపల్ చట్టం, రోడ్డు భద్రతా చట్టాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన పలు అంశాలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

First Published:  18 Jun 2019 4:35 AM GMT
Next Story