ఒక్క సినిమా…. ముగ్గురు విజయ్ లు ..!

వరుస బ్లాక్ బస్టర్ లతో దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెల విడుదల కాబోతోంది.

ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రైటర్ పాత్రలో కనిపించబోతున్నాడట.

అంతేకాదు ఈ సినిమాలో మొత్తం మూడు పాత్రలు ఉండగా మూడింటిలోనూ తనే హీరో గా కనిపించబోతున్నాడట.

అయితే మూడు పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయని… కానీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయని…. అదే అసలు ట్విస్ట్ అని తెలుస్తోంది.

రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నాడు.

ఇందులో ఒక పాత్రలో విజయ్ దేవరకొండ కార్మిక నాయకుడిగా… మరో పాత్రలో ఎన్నారైగా కనిపించబోతున్నాడట. మరి మూడవ పాత్రలో విజయ్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.