హైటెక్ బుర్రకథ వచ్చేస్తోంది

బుర్రకథ అంటే మనందరికీ తెలిసిన మీనింగ్ ఒకటే. కానీ ఇప్పుడీ పదానికి సరికొత్త మీనింగ్ చెబుతున్నాడు దర్శకుడు డైమండ్ రత్నబాబు. ఈయన తీసిన బుర్రకథ సినిమా మరో సరికొత్త కథను చెబుతుందంటున్నాడు. ఇదేంటంటే… ఒకే మనిషికి బుర్రలో రెండు బ్రెయిన్స్ ఉంటే ఏం జరుగుతుందనేదే ఈ సరికొత్త బుర్రకథ. ఆది హీరోగా నటించిన ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, ఈనెల 28న సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

బుర్రకథ సినిమాలో హీరో పాత్ర ఒకటే ఉంటుంది. కానీ అతడి బ్రెయిన్ మారినప్పుడల్లా మరో క్యారెక్టర్ బయటకొస్తుంటుంది. ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్లు కొన్ని వచ్చాయి. కానీ అవన్నీ సీరియర్ మూడ్ లో సాగాయి. ఈ బుర్రకథ మాత్రం ఆడియన్స్ ను పూర్తిస్థాయిలో నవ్విస్తుందని అంటున్నాడు దర్శకుడు రత్నబాబు.

దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీకాంత్ నిర్మించిన ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందించాడు. తన కెరీర్ లో ఆది చేసిన ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ ఇదే. ఆది తండ్రిగా రాజేంద్రప్రసాద్, హీరోయిన్ తండ్రిగా పోసాని ఇందులో రెండు కీలక పాత్రలు పోషించారు. వీళ్ల కామెడీ కూడా సినిమాకు హైలెట్ కానుంది.