Telugu Global
NEWS

జగన్ పాలన భేష్.... తెలంగాణ సీఎం కితాబు !

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా మేలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రశంసించారు. “వైయస్ జగన్మోహన్ రెడ్డి యువకుడు. చదువుకున్నవాడు. పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకున్నవాడు. ప్రజలకు మేలు చేయాలనే తపన ఉన్నవాడు. పొరుగు రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు అన్ని విధాలా సహకరిస్తుంది” అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నీటి పారుదల ప్రాజెక్టులతోపాటు ఇతర అంశాలన్నింటిలోనూ తెలంగాణ ప్రభుత్వం […]

జగన్ పాలన భేష్.... తెలంగాణ సీఎం కితాబు !
X

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా మేలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రశంసించారు.

“వైయస్ జగన్మోహన్ రెడ్డి యువకుడు. చదువుకున్నవాడు. పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకున్నవాడు. ప్రజలకు మేలు చేయాలనే తపన ఉన్నవాడు. పొరుగు రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు అన్ని విధాలా సహకరిస్తుంది” అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

నీటి పారుదల ప్రాజెక్టులతోపాటు ఇతర అంశాలన్నింటిలోనూ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆనందానికి, ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని, భవిష్యత్తులో ఆయన మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తో సహా పొరుగు రాష్ట్రాలతో తెలంగాణ ప్రభుత్వం స్నేహంగా మెలుగుతుందని, అక్కడ వారు, ఇక్కడ మేము…. అభివృద్ధి చెందేలా పరస్పర సహకారంతో కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

రెండు రాష్ట్రాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులు తరచుగా కలుసుకుంటారని, వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు అని ముఖ్యమంత్రి తెలిపారు.

ఇందులో భాగంగా ఈ నెల 27, 28 తేదీలలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇరిగేషన్ అధికారులు హైదరాబాద్ వస్తారని, ఇక్కడి అధికారులతో సమావేశమై సూక్ష్మ స్థాయిలో కూడా నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం తెలంగాణతో స్నేహంగా లేదని, ప్రతి అంశాన్ని వివాదం చేయడానికి…. చంద్రబాబు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

“తెలంగాణలో ఏ ప్రాజెక్టు ప్రారంభించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లేది. ఇక్కడి కాంగ్రెస్ నాయకులతో కలిసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసేందుకు కుట్రలు చేసేది. ముందు ముందు అలాంటి చర్యలు ఉండవు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది” అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

First Published:  18 Jun 2019 9:48 PM GMT
Next Story