కౌసల్య కృష్ణమూర్తి టీజర్ రివ్యూ

తమిళ్ లో సూపర్ హిట్ అయిన కణ సినిమాను తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి పేరిట రిలీజ్ చేస్తున్నారు. తమిళ వెర్షన్ లో కీలకపాత్ర పోషించిన ఐశ్యర్య రాజేష్ నే తెలుగు వెర్షన్ కు కూడా తీసుకున్నారు. ఐశ్వర్య తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ లాంచ్ అయింది. చిరంజీవి ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేశారు.

క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది కౌసల్య కృష్ణమూర్తి సినిమా. ఇప్పుడున్న యూత్‌కి కనెక్ట్‌ అవుతుందనే నమ్మకంతో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఎనర్జిటిక్‌గా ఉంటూనే మంచి ఎమోషనల్‌గా ఉండే ఒక రైతు కుటుంబానికి చెందిన కథతో ఈ సినిమా తెరకెక్కింది. ప్యారలల్‌గా ఒక క్రికెటర్‌, రైతు కథ ఇది. ఈ ఎలిమెంట్స్ అన్నీ టీజర్ లో కనిపించాయి. అందుకే ఈ టైటిల్ కు “ది క్రికెటర్” అనే ట్యాగ్ లైన్ పెట్టారు.

నిజానికి ఈ సినిమా పూర్తిస్థాయిలో రీమేక్ కాదు. తమిళ సినిమాకు చెందిన సన్నివేశాల్ని చాలా చోట్ల యథాతథంగా వాడుకున్నారు. అలా సినిమా బడ్జెట్ ను సగానికి పైగా తగ్గించుకున్నారు. ఈ సినిమాలో కీలకమైన కోచ్ పాత్రను శివ కార్తికేయన్ పోషించాడు. తెలుగులో ఓ పెద్ద హీరోతో ఈ క్యారెక్టర్ చేయించాలనుకున్నారు. కానీ బడ్జెట్ పరిమితుల వల్ల తమిళ్ లో ఉన్న పోర్షన్ నే యాజ్ ఇటీజ్ గా తెలుగు కోసం కూడా వాడేస్తున్నారు.